Madhu Yaskhi: తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhu Yaskhi: ఫోన్ ట్యాపింగ్ లో దొంగలే దొంగ అన్నట్టు ఉన్నదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఎద్దేవ చేశారు. గవర్నర్ కి అనుమానం ఉంటే హోంశాఖ కి ఫిర్యాదు చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజమని ఆరోపించారు. తెలంగాణ వస్తే దుబాయ్.. బొగ్గుబాయి ఉండదు అని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. Nri శాఖ కూడా పెడతా అన్నారని తెలిపారు. కథర్ లో వేల మంది కార్మికులను బయటకి పంపిస్తున్నారని , 25 వేల మందిని బయటకు పంపారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికులకు రేషన్ కార్డ్ కూడా తీసేసింది ఈ ప్రభుత్వం మని తీవ్ర విమర్శలు చేశారు.
Nri పాలసీ వెంటనే అమలు చేయాలని డిమాండ్‌చేశారు. కేంద్రం కూడా nri శాఖ తీసేసిందని, కథర్ నుండి వచ్చే కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పి, ఇప్పటి వరకు నియామకాలు లేవని అన్నారు. తెలంగాణ లిక్కర్ పాలసీ పంజాబ్, ఢిల్లీ పాలసీ నే కాపీ కొట్టిందని ఆరోపించారు. బేవరేజ్ కూడా వాళ్లకు సంబంధించిన వాళ్ళక కట్టబెట్టారని మండిపడ్డారు. అత్యధిక లిక్కర్ సేల్ తెలంగాణ లొనే అని, డ్రగ్స్ అమ్మకాల్లో తెలంగాణ టాప్ అయ్యిందని ఆరోపించారు. డ్రగ్స్ ఎపిసోడ్ ఏమైందో అర్థం కాలేదని తెలిపారు యాష్కీ. తెలంగాణ లిక్కర్ పాలసీ పై సీబీఐ విచారణ జరగాలని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసేసిందే బీజేపీ అని గుర్తు చేశారు. 2013 లో పది వేల కోట్ల రుణాలు మాఫీ చేసి, ఫ్యాక్టరీ ఓపెన్ కావడానికి కాంగ్రెస్ కృషి చేసిందని తెలిపారు. ఇప్పుడేదో బీజేపీ చేసినట్టు ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. ప్రధాని వచ్చినప్పుడే.. టీఆర్‌ఎస్ గొడవ చేస్తుందని అన్నారు.
Also Read
ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీ కాళ్ళ మీద పడి వస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడికి ప్రధాని వస్తుంటే నాటకాలు అడుతున్నారని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్‌ఎస్, బీజేపీ పంచాయతీ అని ఎద్దేవ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో దొంగలే దొంగ అన్నట్టు ఉన్నదని, గవర్నర్ కి అనుమానం ఉంటే హోంశాఖ కి ఫిర్యాదు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజమని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఎన్నిక సీరియస్ గానే తీసుకుంటుందని, అందరూ కలిసి పని చేశారన్నారు. కంటిన్యూగా ఓడిపోవడం విచారకరమన్నారు. తెలంగాణ లో ప్రజల మద్దతు ఎందుకు రావడం లేదు అనే దానిపై సమీక్ష చేయాలని తెలిపారు. ధన ప్రభావం ఒక్కటే ఉండదని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ త్వరలోనే తెలంగాణ బాద్యత లు తీసుకుంటారని తెలిపారు. త్వరలోనే సమీక్ష జరుగుతుందని అన్నారు. సమీక్షలే కాదు దిద్దుబాటు చర్యలు ఉంటాయన్నారు. జోడో యాత్రలో నాయకుల ఐక్యత కనపడింది.. ఇది మంచి పరిణామన్నారు. కమ్యూనిస్టులు మాతో ఉండే కానీ.. ఇప్పుడు లేరని స్పష్టం చేశారు. టీడీపీ కూడా పెంచుకునే పనిలో ఉందని అన్నారు. పార్టీ క్రమశిక్షణకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యల తీసుకుంటామన్నారు.
CM Jagan : ఐటీసీ స్పైస్ ప్లాంట్ – వండర్‌పుల్ మూవ్‌మెంట్
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!