MP Dharmapuri Arvind: ఎంపీ అరవింద్ ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎంపీ ఇంటిలో చొరబడ్డారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు ఎంపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీ ఇంటి ముందు జిస్టి బొమ్మను దగబెట్టి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఇంటి గేటును మూసి వేసిన గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. వారిని పోలీసులు పట్టికుని కిందికి దించారు. ఎమ్మెల్సీ కవితపై అనుచుత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. దీంతో ఎంపీ ఇంటి వద్ద తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. టీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Read also: Allu Arjun: అల్లు అర్జున్‌కు షాక్.. అప్డేట్ ఇవ్వాలంటూ రోడెక్కిన ఫ్యాన్స్
తాజాగా.. ఎమ్మెల్సీ కవితతో బీజేపీ సంప్రదింపులు జరిపిందన్నకేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించిన విషయం తెలిసిందే. అయితే.. లిక్కర్ స్కాంలో చిక్కుకున్న కవితతో సంప్రదింపులు జరపాల్సిన కర్మ బీజేపీకి పట్టలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో కవిత సంప్రదింపులు జరిపిందన్నారు. ఇక, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చే సమయంలో కవితను పిలవలేదన్నారు. దీంతో.. కేసీఆర్‌ను బెదిరించటానికే కవిత కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కు 20సీట్లకు మించి రావన్నారు. ఇక పార్టీలో పాత నేతలను తాను కలుపుకుపోవటం లేదనేది ప్రచారం మాత్రమేనన్నారు. ఇక..నియోజకవర్గ ఇంచార్జ్‌ల విషయంలో కొత్త, పాత నేతలను బాలెన్స్ చేశామన్నారు.