CPM Leader Tammineni Veerabharam: గిరిజనుల ను వేధింపులు గురి చేసిన వారి సర్వే చేస్తే న్యాయం ఎలా జరుగుతుందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రంలో లో బీజేపీ పెరుగుతుందని, బీజేపీ కి వ్యతిరేకంగా కార్యకలాపాలు ఉంటాయని, దేశ ఐక్యతకు బీజేపీ వల్ల ప్రమాదం ఉందని ఆరోపించారు. ఆరెస్సెస్ సిద్ధాంతం అంత ప్రమాదకరమైందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. సర్వే చేసి పొడు పత్రాలను ఇస్తామని చెప్పారు. సర్వే చేస్తామని సీఎం ఇచ్చిన హామీ మేరకు కొనసాగుతుంది? అంటూ ప్రశ్నించారు. అయినా కొన్ని ఇబ్బందులు పెడుతున్నారని, సర్వే లొ పెడుతున్న ఇబ్బందులపై సీఎం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. సర్వే ఫారెస్ట్ అధికారుల చేతిలో సాగుతోందని, గిరిజనులను వేధింపులు గురి చేసిన వారి… సర్వే చేస్తే న్యాయం ఎలా జరుగుతుంది? అంటూ ప్రశ్నించారు.
Read also: Kiara Advani: 3 రోజులు, 3 సినిమాలతో కియారా బిజీ బిజీ
వలస ఆదివాసీలకు హక్కు లేదని అంటున్నారు. పోలీసు వారి సలహా మేరకు వలస ఆదివాసీలకు పొడు హక్కులను నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే నెల నుంచి కార్యాచరణ చేపడతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తామని, ఆర్థిక వ్యవస్థ ను కార్పొరేటర్ కట్టబెట్టింది బీజేపీ అని ఆరోపించారు. కమ్మునిస్టుల నినాదం ఎర్రకోటపై ఎర్ర జెండా నినాదం మని, పొత్తుల ప్రకటనకు సమయం ఇది కాదని మండిపడ్డారు. ఎన్నికలు ప్రకటించిన తరువాతనే ఎక్కడెక్కడ పోటీ ఆనేది ఉంటుందని స్పష్టం చేశారు. అప్పుడు కేంద్ర రాష్ట్ర పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. మునుగోడు ఎన్నిక అప్పటి వరకె భవిష్యత్ లో కలసి పోటీ చేస్తమా చేయమా అనేది వేరని, అది ఇప్పుడు మాట్లాడేది కాదన్నారు ఉండొచ్చు ఉండక పోవచ్చన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
Mother Diary: సామాన్యులపై మళ్లీ భారం.. మదర్ డెయిరీ పాల ధర పెంపు