నేను రావాలని తెలంగాణకు వున్న కోట్ల అప్పులు తీరాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీ తెలంగాణ భవన్ లో కె.ఏ.పాల్ సీఎం వేడుకలు జరిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడు వస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలపై చర్చ జరగలేదని మండిపడ్డారు.
Etala Rajender: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తన పేరును ప్రస్తావించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. డైట్ చార్జీలపై ఈటల సూచనలు తీసుకోవాలని సీఎం సూచించారు.
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించిన ప్రభుత్వం. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ఆవిర్భావ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
మేం అధికారంలోకి వచ్చాక.. సెక్రటేరియట్ పైన ఉన్న డోమ్లను కూల్చివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగింది. ముందుగా స్పీకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు సీఎం. అనంతరం పోడు భూముల విషయంలో సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను కేసులకు భయపడను..నాకు కొత్త ఏమి కాదంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతిభవన్పై వాఖ్యలపై స్పందించిన మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. 2024 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నారు.