TS New Secretariat: సచివాలయం తెలంగాణాకు తలమానికంగా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సచివాలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంటోంది. త్వరగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో రాత్రి పగలు తేడా లేకుండా పనులు కొనసాగుతున్నాయి. మంత్రుల ఛాంబర్లు, సమావేశ మందిరాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 30 వ తేదీన సమీకృత కొత్త సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై నుంచి వెళ్లే వాహనదారులు తెలంగాణ నూతన సచివాలయాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రత్యేకతలు ఇవే..
* అద్భుతమైన గ్రీనరీ, వాటర్ ఫౌంటెన్లతో ఇక్కడి ల్యాండ్ స్కేప్ చూపరులకు కనువిందు చేయనుంది.
* ఎత్తైన ప్రహరీ, విశాలమైన పార్కింగ్ ప్లేస్, హెలిపాడ్లతో సహా అన్ని ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ ను నిర్మించారు.
* ఉద్యోగుల కోసం, సందర్శకుల కోసం క్యాంటీన్, పోస్ట్ ఆఫీస్, బ్యాంకు, ప్రత్యేకమైన పార్కింగ్ లాంటి సకల సౌకర్యాలను కల్పించారు.
* బిల్డింగు 6 వ అంతస్తులో ముఖ్యమంత్రి, ఆయన సిబ్బంది కొలువుదీరనున్నారు. సీఎం ఛాంబర్ కు అనుసంధానంగా ఒక భారీ మీటింగ్ హాలును ఏర్పాటు చేశారు.
* ప్రధాన కార్యదర్శి, సంబంధిత సిబ్బంది ఛాంబర్లు కూడా ఇదే అంతస్తులో ఉండనున్నాయి.
* మొదటి అంతస్తును సాధారణ పరిపాలన, ఆర్థికశాఖలకు కేటాయించారు.
* ఇక క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడానికి వీలుగా విశాలమైన హాలు, ఒక బాంక్వెట్ హాలు, మరో పెద్ద ఆడిటోరియం, దేశవిదేశాల నుంచి ముఖ్య అతిథులు, ప్రతినిధులు వస్తే అక్కడే భేటీ అయ్యేలా ఏర్పాట్లు, ప్రతి అంతస్తులో మంత్రుల ఛాంబర్లకు అనుసంధానంగా సమావేశ మందిరాలను కూడా ఏర్పాటు చేశారు.
* విశిష్ట అతిథులు వస్తే సమావేశం అయ్యేలా తూర్పు వైపు పోర్టికో పై భాగంలోని మధ్య గుమ్మటంలో హుస్సేన్ సాగర్ లేక్ వ్యూతో ఏర్పాటు చేసిన మీటింగ్ హాలు కొత్త సచివాలయంకు హైలైట్ అని చెప్పొచ్చు.
* ఇక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, జాతీయ పండుగల సందర్భంగా సౌధం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో వెలిగించడానికి జాతీయజెండా, ఇతర లైటింగులను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు.
* దేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వనగరం హైదరాబాదులో పూర్తి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న పరిపాలనాసౌధం 3 డీ యానిమేషన్ సచివాలయానికే కనువిందు చేయనుంది.
Praveen phone: షాకింగ్.. ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో మహిళల న్యూడ్ ఫోటోలు..!