బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అక్రమాలు ఎక్కడుంటే సీబీఐ, ఈడీ అక్కడే ఉంటాయని వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాక్షస పాలన నడుస్తోందని వారిని తరిమికొట్టేందుకు బిజెపి శ్రేణులు సిద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను ఇష్టారాజ్యంగా దోచుకుందని ఆరోపణలు గుప్పించారు.
Also Read: Influenza A: మార్చి చివరి నాటికి ఇన్‌ఫ్లూయెంజా తగ్గుముఖం.. హెచ్3ఎన్2ను పరిశీలిస్తున్నామన్న కేంద్రం
కేసీఆర్, కేటీఆర్, కవిత అక్రమంగా దోచుకున్న ఆస్తులపై సీబీఐ, ఈడీ దర్యాప్తులు చేపడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ …ఉపాధ్యాయులకు టైంకు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఇబ్బంది పెడుతుందని ఆరోపంచారు.
కాగా, లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈడీ విచారణ రేపు జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అవుతారంటూ గత కొద్ది రోజులు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో వివేక్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మహిళల రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో కవిత దీక్ష చేశారు.