ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను హాజరవుతున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ మీద విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎంపీలు ముస్లింలను ఆర్థికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ముస్లింలను ఎదుర్కొనేందుకు ప్రజలు తమ ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలన్నారు. కానీ మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని వేధించడంలో బిజీగా ఉంది అంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
Also Read:Facebook: ఉద్యోగులకు మెటా షాక్.. ఉద్యోగులపై వేటుకు ప్లాన్ !
కాగా.. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ హాజరువుతున్నారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతో కవిత భేటీ అయ్యారు. ఢిల్లీలో కవితకు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకుని కవితను కలిశారు. కవిత విచారణతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కవితను ఏ ఏ ప్రశ్నలు అడుతారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.
Also Read:Dhruvanarayan: గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
కవిత విచారణ సందర్భంగా ఆమెకు మద్దతుగా ఫ్లెక్సీలు, పోస్టర్లూ ఆసక్తికరంగా మారాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ కొంతమంది బీజేపీ నేతల ఫొటోలతో ఈ పోస్టర్లు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు…సీబీఐ, ఈడీ దాడులు జరగగానే.. కాషాయరంగు పూసుకుని.. బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేంధు అధికారి, ఎంపీ సుజనా చౌదరి తదితరుల ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి.