బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రకటన విడుదల చేసారు. బీఆర్ఎస్ నాందేడ్ సభపై ఆయన విమర్శలు గుప్పించారు. నిన్న మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ సభ తుస్సు మందని ఎద్దేవ చేశారు.
ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్ సీయం కేసీఆర్ పాల్గొననున్ననేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్ రెడ్డి టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, తదితరులతో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Kumaraswamy : తెలంగాణ సీఎం కేసీఆర్ తో తనకు అభిప్రాయ బేధాలు లేవని.. తన తండ్రి తర్వాత అంతటి వారు కేసీఆర్ అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కుమారస్వామి హాజరుకాకపోవడం అందరిలో అనేక అనుమానాలను తావిచ్చిన సంగతి తెలిసిందే.
Telangana Budget : తెలంగాణ అసెంబ్లీ 2023–24 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు మధ్యాహ్నం 12.10 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు.
మహారాష్ట్ర నాందేడ్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటిన కొనసాగుతుంది. ఈనేపథ్యంలో.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో పలువురు ప్రజాప్రతినిధులు చేరారు. పార్టీ కండువాలు కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి.
ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.. జాతీయ రాజకీయాలను మరింతగా ఆకర్షించడమే ఈ సభ లక్ష్యం. ఇటీవల ఖమ్మంలో బీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో రాష్ట్రం వెలుపల ఇదే తరహాలో మరో సభ నిర్వహిస్తే.. పార్టీలో ఉత్సాహం పెరుగుతుందని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఎక్కడ తప్పు మాట్లాడలేదు చట్టం ప్రకారం నడుచుకోవాలని చెప్పామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మియాపూర్ భూముల విషయంలో ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయమా? అని ప్రశ్నించాను అన్నారు.