మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దార్శనికత దేశ ప్రజలతో పాటు, రాజకీయాల్లో తలపండిన పలు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులను ఆకట్టుకుంటున్నది. అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా యావత్ దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతు తమ విధివిధానాలు నచ్చిన వారిని పార్టీలోకి ఆహ్వనిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు.
Also Read : Pawan Kalyan: లీకులు షురూ.. దేవుడిగా పవన్ లుక్ వైరల్
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎన్సీపీ)కి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్నధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్ ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, మహారాష్ట్ర ఎన్సీపీ యూత్ సెక్రటరీ శివరాజ్ ధోంగేతో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో చేరేందుకు వచ్చిన నేతలందరు ఇప్పటికే సీఎం కేసీఆర్ తో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు.
Also Read : AP Budget 2023: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. బడ్జెట్ కు ఆమోదం
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు మహారాష్ట్ర నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.