Telangana Budget : తెలంగాణ అసెంబ్లీ 2023–24 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు మధ్యాహ్నం 12.10 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు.
మహారాష్ట్ర నాందేడ్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటిన కొనసాగుతుంది. ఈనేపథ్యంలో.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో పలువురు ప్రజాప్రతినిధులు చేరారు. పార్టీ కండువాలు కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి.
ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.. జాతీయ రాజకీయాలను మరింతగా ఆకర్షించడమే ఈ సభ లక్ష్యం. ఇటీవల ఖమ్మంలో బీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో రాష్ట్రం వెలుపల ఇదే తరహాలో మరో సభ నిర్వహిస్తే.. పార్టీలో ఉత్సాహం పెరుగుతుందని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఎక్కడ తప్పు మాట్లాడలేదు చట్టం ప్రకారం నడుచుకోవాలని చెప్పామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మియాపూర్ భూముల విషయంలో ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయమా? అని ప్రశ్నించాను అన్నారు.
కాంగ్రెస్ పార్టీని ఓడించే అవసరం మాకు లేదని.. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నే శత్రువంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచల వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ని ఓడించే కార్యాచరణ తీసుకోవడం మాకేం అవసరం లేదన్నారు. మాకు మేమె శత్రువులమని వైస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. ఖమ్మం సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకంలో తన కళ్ళకు పరీక్ష చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
నా మాటలను వక్రీకరించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. మహబూబాబాదు జిల్లా నరసింహులపేట మండలం వేదికలో నేను అలా చెప్పలేదని అన్నారు. ఆవార్తలపై స్పందించిన మంత్రి క్లారిటీ ఇచ్చారు.