డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది.
Revanth Reddy: తెలుగుదేశం పార్టీ హయాంలో ఓఆర్ఆర్ ప్రతిపాదన పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్కు పునాది పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారన్నారు.
Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
Srinivas Goud: తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తున్నారని, 10 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోతామని, వైన్స్ షాప్ లలో రిజర్వేషన్లు దేశంలో ఎక్కడ లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు లోని మినీ స్టేడియం ప్రారంభోత్సవంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో అందరి జీవితాలలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు గెలిస్తే వేదిక పైన ఉన్న పెద్దలు రాష్ట్రంలో 90% సీట్లు గెలిపిస్తారు అని పేర్కొన్నారు. ఓవైపు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రంలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నాడు అని రేవంత్ రెడ్డి తెలిపాడు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు గెలిపించాల్సిన అవసరం ఉంది అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క ఎకరాకైనా అదనంగా సాగు నీరు అందించారా అని ఆయన ప్రశ్నించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు ప్రెస్ మీట్ పెట్టారు. జీవన్ రెడ్డి దళిత బంధు పథకంపై మతిబ్రమించి, సంస్కరహీనంగా మాట్లాడారు అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు జీవన్ రెడ్డికి మెదడు లేదు అంటూ విమర్శించారు.
ఖమ్మ జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు ఇస్తున్నా.. అనే సాకు చూపించి అరకొర రైతుబంధు ఇచ్చి రైతులకు ఏదో మేలు చేస్తున్నాను అని చేప్తున్న కేసీఆర్ కి ఆకాల వర్షంతో నష్టపోయిన రైతుల కష్టాలు కనపడుతున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించారు.