Kishan Reddy: ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. HMDA టోల్ ట్యాక్స్ ద్వారా 30 ఏళ్లలో రూ. 75 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ORRపై ఆదాయం పెరగదు కానీ తగ్గదు. నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే లీజుకు ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలను కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్న బీఆర్‌ఎస్ పార్టీ ఓఆర్‌ఆర్‌ను ప్రైవేట్ కంపెనీకి ఎందుకు లీజుకు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏ కంపెనీకి టెండర్ వేయాలనేది ముందే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓఆర్‌ఆర్ ప్రైవేటీకరణ పేరుతో కల్వకుంట్ల కుటుంబం కొత్త డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు.
Read also: Neet Exam: నీట్ పరీక్ష నిబంధనలపై పేరెంట్స్ ఫైర్.. ఇవేం రూల్స్ అంటూ..
హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌కు 2031 వరకు మాత్రమే అనుమతి ఉందని.. 2031 వరకు మాత్రమే మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం తెలిపినా ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లకు ఎలా లీజుకు ఇస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం కొంటామని కేసీఆర్ సర్కార్ హడావుడి ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణకు తలమానికంగా ఉన్న ఓఆర్‌ఆర్‌ను కేసీఆర్ సర్కార్ ప్రైవేట్ కంపెనీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ఓఆర్‌ఆర్‌ను ఐఆర్‌బీ కొనుగోలు చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ORR టోల్ ఫీజు ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా రూ. 415 కోట్ల ఆదాయం వస్తుంది. 30 ఏళ్ల తెలంగాణకు ప్రస్తుత బేస్ ధర ప్రకారం రూ. 30 వేల కోట్లు ఆదాయం వస్తుందని చెప్పారు. ఏటా 10 శాతం టోల్ ఫీజు పెంచితే 30 ఏళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వానికి రూ. 70 వేల కోట్ల ఆదాయం వస్తుంది. పూణే-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేకి పదేళ్లపాటు రూ. 8,875 కోట్లకు లీజుకు తీసుకున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో చాలా హైవేలను పది నుంచి 15 ఏళ్లకే లీజుకు తీసుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించారు.
Mocha: మోచా తుఫాన్, తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్