తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేసే కార్యదర్శులు తమను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెల ( ఏప్రిల్ ) 29వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో వారు వెంటనే విధుల్లో చేరాలని లేకపోతే ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసివేస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దీంతో వారు ఇవాళ ( మంగళవారం ) 5 గంటల లోపు డ్యూటీలో చేరాలని గడవు కూడా ఇచ్చింది.
Also Read : Somesh Kumar: సోమేష్ కుమార్‌కు సీఎం కేసీఆర్ కీలక పదవి..! నేడో.. రేపో ఉత్తర్వులు..
దీంతో జూనియర్ సెక్రటరీలకు ప్రతిపక్ష నాయకులు సపోర్టు ఇస్తున్నారు. ప్రభుత్వం దర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా జేపీఎస్ ల సమ్మెకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తే నోటీసులివ్వడం దారుణమని ఈటల రాజేందర్ అన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్ వేతనాలు ఎందుకు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే జేపీఎస్ ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read : Voter List: ఓటరు జాబితాలో మీ పేరుందా? ఇప్పుడు ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు
మరోవైపు.. జేపీఎస్ ల సమ్మెపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యూలర్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జేపీఎస్ ల పరిస్థితి బానిసల కంటే హీనంగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.