CM KCR: ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు 105 సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు పిల్లల కోళ్లలా ఉండాలని.. అందరినీ కాపాడాలని సూచించారు. ఈ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలంతా సమన్వయంతో ముందుకు సాగాలని.. ప్రతి విషయాన్ని లోతుగా గమనిస్తానని హెచ్చరించారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కూడా కేసీఆర్ విమర్శలు గుప్పించారు. మోదీ దేశాన్ని మోసం చేశారని సీఎం వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్ బోగస్ అని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులతో కలిసి రావాలని ఆయన ఆదేశించారు. జూన్ 2 నుంచి జరిగే సమావేశాలకు ఎమ్మెల్సీలు, ఎంపీలను పిలవాలని కేసీఆర్ సూచించారు. నెలలో 21 రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని సీఎం హెచ్చరించారు.
సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటకలో ఎవరు గెలిచినా పెద్ద విషయం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ద్రోహం చేసిందన్నారు.ఈలోగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు 105 సీట్లు వస్తాయని కేసీఆర్ అన్నారు. పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రజలకు చేసిన సేవ గురించి వివరించాలన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఆయా జిల్లాల్లో తెలంగాణ దశాబ్ది వేడుకలను మంత్రులు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, తెలంగాణ వచ్చాక మారిన పరిస్థితులను ప్రజలకు వివరించాలని కేసీఆర్ కోరారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజల మధ్య ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ తీసేస్తే ఐదు నెలలే అని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూర్తిగా నియోజకవర్గాలకే పరిమితం కావాలని సూచించారు.
Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఈ నెల 20న ప్రమాణస్వీకారం