ఆంధ్రావాళ్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆత్మహత్యకు పాల్పడ్డ నవీన్ కుటుంబాన్ని జీవన్ రెడ్డి పరామర్శించారు.
రోడ్డు మీద సిగ్నల్ దగ్గర కూడా సెల్ఫీలు దిగుతా అయితే తనతో నాకు సంబందం ఉందట అఖల్ వుండాలని అనడానికైనా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్. దేశ రాజకీయలను శాసించేందుకు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన కేసీఆర్..దూకుడుగా తమ రాజకీయ ప్రణాళికలను అమలు చేస్తున్నారు
కాంగ్రెస్ పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సీనియర్ల పై నేను చేసిన వ్యాఖ్యలు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అసలు ఆ ప్రస్తావన తేలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సచివాలయం తెలంగాణాకు తలమానికంగా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సచివాలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కవితతో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ తో కలిసి శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణుల ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కవితను ఈడీ ప్రత్యేక బృందం ప్రశ్నిస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను హాజరవుతున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.