ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపండి అంటూ అందులో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్ చేసిన భూములను లాక్కుంటూ రియల్ వ్యాపారం చేయడం దుర్మార్గం అంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అంటే వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమే అని బండి సంజయ్ అన్నారు.
Also Read : NTR30: ‘దేవర’ టైటిల్ నాది.. నా టైటిల్ కొట్టేశారు.. బాంబ్ పేల్చిన బండ్లన్న
దళితులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని వమ్ము చేసి ప్రభుత్వం దళితులనే మోసం చేస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇదిగో… అదిగో పోడు భూములకు పట్టాలిస్తాం.. అంటూ హామీలివ్వడవ్వమే తప్ప అమలు మాత్రం ఇప్పటి వరకు చేయలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రియల్ ఎస్టేట్ దందాకు దళితుల, గిరిజనుల భూములను గుంజుకుంటారా? దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష.. అంటూ సీఎం కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు.
Also Read : Domestic Violence: మాజీ ప్రధాని మనవరాలికి వరకట్న వేధింపులు.. కేసు నమోదు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు రక్షణ కరువైంది అని బండి సంజయ్ అన్నారు. దళితులు, గిరిజనుల బతుకులను ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలి అంటూ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో ఆయన వెల్లడించారు. అసైన్డ్ భూముల్లో రియల్ దందాకు తెరదించకుంటే భారతీయ జనతా పార్టీ ( బీజేపీ ) తెలంగాణ శాఖ పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడతాం అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లింపుల్లో నిర్లక్ష్యం వల్ల మీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇప్పటికే చదువులకు దూరం అవుతున్నారంటూ బండి సంజయ్ తెలిపాడు. దళితుల సంక్షేమమంటే ఎత్తైన విగ్రహాలు, పాలనా భవంతులకు పేర్లు కాదు.. వారికి జీవనోపాధి కల్పించడమే ముఖ్యం అంటూ ఆ లేఖలో తెలంగాణ బీజేపీ చీఫ్ వెల్లడించాడు.
Bandi Latter To Kcr