ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాల బీఆర్ఎస్ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా పార్టీ ప్రజాప్రతినిధులతో ప్లీనరీ నిర్వహించే బీఆర్ఎస్ ఈ ఏడాది సాధారణ సమావేశానికే పరిమితం చేయాలని నిర్ణయించింది.
New Secretariat: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెల 30న సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు నాశనమవుతున్నాయి. కందిపప్పులో నూర్చిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Komati Reddy : తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచే పోటీచేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తాను బరిలోకి దిగితే ప్రజలు తనను కచ్చితంగా గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కార్ వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. మరో వైపు ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు అని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదు అని అంటూ కామెంట్స్ చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ నుంచి దేశానికి నష్టం అని భావించే... BRS పార్టీని ఏర్పాటు చేశాడు అని చాడ వెంకటరెడ్డి అన్నాడు.
మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి , నాగర్ కర్నూల్ జిల్లాకు ఇన్చార్జి వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్న సందర్భంగా అంబేద్కర్ మద్దతుదారులు దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి తరలిరానున్నారు.