Hardik Pandya: నా సక్సెస్‌కు కారణం ఆమె.. ఇంకా పదేళ్లు ఆడుతా, పది ట్రోఫీలు గెలుస్తా!
- హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు
- ఇంకా పదేళ్లు ఆడుతా, పది ట్రోఫీలు గెలుస్తా
- నా సక్సెస్‌కు కారణం ఆమె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Sets Target of 10 Trophies in Next 10 Years: టీ20 ప్రపంచ కప్ 2026 విజయం అనంతరం భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ విజయం కోసం తాను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నానని, ఇది తనకు ఒక రిడెంప్షన్ లాంటిదని చెప్పాడు. గతంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, ఒత్తిడులు అన్నింటినీ దాటి.. తిరిగి బలంగా నిలబడ్డాడని తెలిపాడు. తన గర్ల్ ఫ్రెండ్ మహికానే ఈ సక్సెస్‌కు కారణం అని స్పష్టం చేశాడు. తన జీవితంలోకి మహికా వచ్చిన తర్వాత మరింత ముందుకు వెళ్లాలని, విజయాలపై దృష్టి పెట్టాలని ప్రేరణ పొందానని హార్దిక్ చెప్పుకొచ్చాడు. హార్దిక్ న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ గెలిచి.. మూడోసారి టైటిల్ అందుకుంది.
ఫైనల్ మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ… ‘2024 ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆ అనుభవం తర్వాత నేను మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నా. భారత్ కోసం ట్రోఫీలు గెలవడమే నా జీవిత లక్ష్యం. ఎన్ని సాధ్యమైతే అన్ని ఎక్కువ ట్రోఫీలు దేశానికి అందించాలని కోరుకుంటున్నా. బార్బడోస్ విజయానంతరం ఓ మాట చెప్పా.. నేను ఆడే ప్రతి టోర్నీలో ట్రోఫీ గెలుస్తా అనే నమ్మకం వ్యక్తం చేశా. అది మాటలకే పరిమితం కాలేదు. నేను నమ్మినది ఈరోజు వాస్తవంగా జరిగింది. ఈ విజయం వెనుక కేవలం సంకల్పం మాత్రమే కాదు, అపారమైన కష్టం ఉంది. జీవితంలో నేను సాధించిన ప్రతి ఫలితానికి కారణం కష్టపడటమే. ఎప్పుడూ కష్టపడటం, మంచి మనిషిగా ఉండటం నాకు ముఖ్యం. జీవితంలో ఎలాంటి ఫలితాలు వచ్చినా.. నాకు కష్టపడి పనిచేయడం మాత్రమే తెలుసు’ అని చెప్పాడు.
Also Read
- Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
తన విజయానికి వెనుక ఉన్న వ్యక్తులకు కూడా హార్దిక్ పాండ్యా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘నన్ను చాల మంది సపోర్ట్ చేశారు. నా సొంత టీం, మోహిత్, కార్తీక్, నా ఫిజియో, నా సెక్యూరిటీ సిద్ధాంత్, నా న్యూట్రిషనిస్ట్ నికోల్, నా ట్రైనర్స్ సాగర్, నా చెఫ్ విజయ్.. అందరికి కృతజ్ఞతలు. మీరు చూసే హార్దిక్ పాండ్యా అంటే.. ఈ వ్యక్తుల తెరవెనుక కష్టమే. హార్దిక్ అనే ఆటగాడు ఈ స్థాయికి రావడానికి వీళ్లందరి కృషి ఎంతో ఉంది. ఇక నా జీవితంలోకి మహికా వచ్చిన తర్వాత మరింత ముందుకు వెళ్లా. విజయాలపై దృష్టి పెట్టాలని ప్రేరణ పొందా. మహికాకు, నా మొత్తం జట్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారు లేకుండా నేను ఇక్కడ లేను. ఇది సాధ్యం కాదు కూడా. మీరు ఎంత కష్టపడి పనిచేసినా.. మద్దతు చాలా అవసరం. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను’ అని హార్దిక్ తెలిపాడు.
ఇక తన కెరీర్ గురించి కూడా హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రస్తుతం నేను సీనియర్ ఆటగాడిని. అయినా ఇంకా దాదాపు పది సంవత్సరాల క్రికెట్ ఆడుతా. ఇప్పటివరకు కెరీర్‌లో సగం మాత్రమే పూర్తయింది. మిగతా సగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నా. ఐసీసీ, ఐపీఎల్ కలిపి కనీసం పది ట్రోఫీలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ముఖ్యంగా ఐసీసీ ట్రోఫీలు నాకు అత్యంత ముఖ్యం. భారత్‌లో ప్రపంచకప్ గెలవడం ఎంతో భావోద్వేగానికి గురిచేసే విషయం. అభిమానుల ఆనందం చూడటం చాలా గొప్ప అనుభూతి. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై వేసిన 19వ ఓవర్ కూడా నాకు చాలా ప్రత్యేకం. మ్యాచ్‌లో ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లు చాలా కష్టపడ్డారు. ఇద్దరు అవకాశాల కోసం ఓర్పుతో ఎదురు చూశారు. ఈరోజు వారు మ్యాచ్ విన్నర్స్. దేవుడు వారి కష్టానికి తగిన ఫలితం ఇచ్చాడు. ఇద్దరు సాధించిన విజయంపై నాకు ఎంతో గర్వంగా ఉంది’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!