Good News: చదువుతో పాటు విద్యార్థుల ఆకలి తీర్చుతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని సర్కారు బడుల్లో మధ్యాహ్నా భోజనం అమలవుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తూనే ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఉదయం కూడా పిల్లలకు అల్పాహారాన్ని(టిఫిన్) అందించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉదయం స్కూలుకు వచ్చిన విద్యార్థులకు టిఫిన్ పెడతామని కీలక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Read Also :Waqf Board Chief: కర్ణాటక ఉపముఖ్యమంత్రి ముస్లిం అయి ఉండాలి.. వక్ఫ్ బోర్డు చీఫ్ కీలక వ్యాఖ్యలు
పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య బెల్లం, రాగితో చేసిన పదార్ధాలను అందిస్తామని ప్రకటించింది. సర్కార్ నిర్ణయం వెనుక కారణం ఏంటంటే.. చాలా ప్రాంతాల్లో విద్యార్థులు ఉదయం ఖాళీ కడుపుతో బడికి వస్తున్నారని.. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్ తెలిపింది. అలాగే మధ్యాహ్నం భోజనం మెనూలోనూ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారంలో ఒకరోజు వెజిటబుల్ బిర్యానీతో పాటు హైస్కూల్ విద్యార్థులకు తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని అందిస్తామని పేర్కొంది.
Read Also :Rangareddy : పిల్లలు ఏం చేశారు తల్లి.. అభం శుభం తెలియని వాళ్ల ప్రాణం తీశావు