Pakistan Cricket: “అభినందనలు”.. టీమిండియా హ్యాట్రిక్ విజయంపై పాకిస్థాన్ షాకింగ్ రియాక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Cricket: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మూడో కప్పు కొట్టేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఆధిపత్యం చెలాయించింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో సంజూ, ఇషాన్, అభిషేక్ దుమ్ముదులిపేశారు. ఈ విజయం టీమిండియా ప్లేయర్లు, అభిమానుల భావోద్వేగాలను రేకెత్తించింది. భారత్ విజయంపై ఊహించిన వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వ్యక్తులు ఎవరోకాదు.. పాకిస్థాన్‌కు చెందిన మాజీ ప్లేయర్స్. టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ మొహమ్మద్ హఫీజ్, సక్లైన్ ముష్తాక్, షాహిద్ అఫ్రిది, సనా మీర్, ఉమర్ గుల్, షోయబ్ అక్తర్ భారత్‌ను అభినందించారు. ఈ విజయం వారి దేశీయ నిర్మాణానికి మరియు దేశంలో ఉన్న క్రికెటర్ల రకానికి నిదర్శనమని అన్నారు. భారత్ మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం వెనుక ఆ దేశంలోని పటిష్టమైన దేశవాళీ క్రికెట్ వ్యవస్థ ఉందనడంలో సందేహం లేదని కొనియాడారు. భారత్ నుంచి వస్తున్న అద్భుతమైన ప్లేయర్స్ క్రికెటర్లే ఈ ఘనతకు అసలు కారణమని విశ్లేషించారు. మరోవైపు.. మొదటి నుంచి భారత్‌పై విషం కక్కుతూ వచ్చిన పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ఈ విజయంపై స్పందించాడు. ఇటీవల భారత్ ఫైనల్‌లో ఓడిపోతుందని తాను చెప్పిన జోస్యం తప్పని అంగీకరించాడు. ఫైనల్‌లో టీమ్ ఇండియా తన అద్భుత ప్రదర్శనతో తనను తప్పుగా నిరూపించిందని అమీర్ పేర్కొన్నాడు.
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
తాజావార్తలు
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?