Konda Vishweshwar Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన లేఖ రాజకీయ డ్రామా మాత్రమేనని, దీని వెనుక అసలు స్కెచ్‌ను మాజీ సీఎం కేసీఆరే తయారుచేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… ఈ డ్రామా ద్వారా కవిత మీడియా దృష్టిని ఆకర్షించగలిగిందని, హెడ్లైన్లలో నిలవడమే లక్ష్యంగా ఇది సాగించబడిందని వ్యాఖ్యానించారు. “కవిత తన ఉద్దేశాన్ని సాధించగలిగింది. బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోతుండటంతో దృష్టి మళ్లించేందుకు…
కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీపై కవిత ఆరోపణలు చేయడం ఏంటి? కవిత ఎందుకు జైలుకు పోయింది? వాళ్లకు ఉన్న క్రెడిట్ ఏంటి? అని ప్రశ్నించారు. ఇది డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్ సమస్య అని స్పష్టం చేశారు. అది ఓ డ్రామా.. వాళ్ళ డ్రామాలో తాము భాగస్వామ్యం కాదలచుకోలేదని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం తొలిసారి స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమేనన్నారు. లిక్కర్ స్కామ్ పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పించారు.
MLC Kavitha: ఏప్రిల్ 9 వరకు ఎమ్మెల్సీ కవితకు స్పెషల్ కోర్ట్ జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కవిత మధ్యంతర బెయిలుపై ఒకటో తేదీన విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కవితను అధికారులు జైలుకు తరలిస్తున్నారు.
KTR-Harish Rao: ఇవాళ కవితను కలిసేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ సామ్ లో అరెస్ట్ అయిన కవితను ఇవాళ ఆదివారం సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలో కేటీఆర్, హరీష్ రావులు కలిసే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.
Kavitha Arrest: ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, మరికొందరు కీలక నేతలు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కేంద్ర బీజేపీ నాయకులు ఈ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర అని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంకి నాకు ఎటువంటి సంబంధం లేదని, దర్యాప్తుకు సహకరిస్తా అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై కవిత స్పందిస్తూ.. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..…