Kavitha Arrest: ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, మరికొందరు కీలక నేతలు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. అరెస్ట్ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. కవిత అరెస్టుతో పాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోడీ-బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read also: CM Revanth Reddy Vizag Tour: నేడు విశాఖలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన..
కవిత అడ్వకేట్ మోహిత్ రావు
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో ఈడీ అక్రమంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత తరపున వాదిస్తున్న లాయర్ మోహిత్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారానికి వాయిదా వేసినట్లు వివరించారు. ఈ కేసులో కవితపై కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలోనే కోర్టుకు హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తప్పవని ఈడీ హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే ముందస్తు ప్రణాళికలో భాగంగా కవితను సోదాల పేరుతో అరెస్ట్ చేసి, విమాన టిక్కెట్లు కూడా ముందుగానే బుక్ చేసుకున్నారు.
కవితకు అనేక న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయని, అరెస్టును సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని ఆయన చెప్పారు. మరోవైపు కేటీఆర్, ఇతర నేతలు కవిత నివాసం లోపలికి వెళ్లారు. కవిత అరెస్టు చట్ట విరుద్ధమని, అక్రమమని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారిణి భానుప్రియ మీనా కేటీఆర్‌తోపాటు ఇతర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు జరుగుతుండగా అనుమతి లేకుండా లోనికి ప్రవేశించారని వాపోయారు. వాటన్నింటినీ వీడియో తీయాలని మరో ఈడీ అధికారిని ఆదేశించారు.
Deepika Pilli : ఫారిన్ లో సోలోగా ఎంజాయ్ చేస్తున్న ఢీ బ్యూటీ..