MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు.. దర్యాప్తుకు సహకరిస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కేంద్ర బీజేపీ నాయకులు ఈ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర అని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంకి నాకు ఎటువంటి సంబంధం లేదని, దర్యాప్తుకు సహకరిస్తా అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై కవిత స్పందిస్తూ.. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేను మానసికింగా కుంగిపోతానని వారు అనుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈపోరాటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నాపై ఆరోపణలు చేసిన కేంద్రంపై పోరాటంలో వెనక్కొ తగ్గేదిలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు.. బట్టకాల్చి మీద వేస్తున్నారు. ఎవరి మీద వారిమీద ఆరోపణలు చేయడం సరైంది కాదు.. కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారని ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. ఇది వ్యర్థ ప్రయత్నాలు మిగిలిపోతాయి.. కేసీఆర్ ని మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారు.. మాపై ఆరోపణలు చేసినా మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు.
Also Read
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
కేసీఆర్ ఫ్యామిలీతో పాటు లిక్కర్ మాఫియా నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రూ. 150 కోట్లు అందాయని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ పర్వేజ్ వర్మ. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ లో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారని ఆరోపించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్, ఇతర ఎక్సైజ్ అధికారులతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఓబెరాయ్ హోటల్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం ప్రైవేట్ విమానంలో ఢిల్లీకి వచ్చేవారని, దీనికి తెలంగాణకు చెందిన లిక్కర్ మాఫియా సహకరించేదని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరు కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారని, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి విధానాన్నే అమలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎల్1 లైసెన్సు హోల్డర్లని, మద్యం మాఫియాను దక్షిణాది నుంచి ఢిల్లీకి తీసుకువచ్చింది కేసీఆర్ కూతురు కవితే అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. రెడ్డి బ్రదర్స్ ను కూడా తీసుకువచ్చిందని, కవిత ఢిల్లీకి వచ్చి రూ.4.5 కోట్లతో డీల్ కుదిర్చారని అన్నారు. ఆప్ పంజాబ్, గోవా ఎన్నికల సందర్భంగా అడ్వాన్సుగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. పంజాబ్ లో లిక్కర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయించారని, చద్ధా ఫ్యామిలీ నుంచి రూ. 4.5 కోట్లు ముట్టాయని,రూ. 3 కోట్లు నగదు, రూ.1.5 కోట్ల క్రెడిట్ నోట్ తీసుకున్నారని అన్నారు. ఇదంతా కేసీఆర్ కూతురు కవిత ద్వారానే జరిగిందని తీవ్ర ఆరోపణలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో కేసీఆర్ ఫ్యామిలీపై బీజేపీ కావాలనే కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తోందని, దర్యాప్తుకు సహకరిస్తానని స్పష్టం చేసారు.
Mlc Kavitha Press Meet Live: ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ లైవ్
తాజావార్తలు
-
Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!