Konda Vishweshwar Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన లేఖ రాజకీయ డ్రామా మాత్రమేనని, దీని వెనుక అసలు స్కెచ్‌ను మాజీ సీఎం కేసీఆరే తయారుచేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… ఈ డ్రామా ద్వారా కవిత మీడియా దృష్టిని ఆకర్షించగలిగిందని, హెడ్లైన్లలో నిలవడమే లక్ష్యంగా ఇది సాగించబడిందని వ్యాఖ్యానించారు. “కవిత తన ఉద్దేశాన్ని సాధించగలిగింది. బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోతుండటంతో దృష్టి మళ్లించేందుకు ఇది వ్యూహాత్మకంగా తయారుచేసిన స్క్రిప్టు. ఇది పూర్తిగా ట్రాష్ డ్రామా. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే ఈ స్కెచ్‌లన్నీ జరుగుతున్నాయి,” అని కొండా తీవ్రంగా విమర్శించారు.
CM Chandrababu : అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు…
“కేసీఆర్ కుటుంబం రాజకీయాల్లో ప్రొఫెషనల్. అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు, లేకపోతే జుట్టు పట్టి తన్నేస్తారు. ఇదే వారి రాజకీయం,” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్–బీజేపీ కలయికపై వస్తున్న ఊహాగానాలను కొండా ఖండించారు. “కేసీఆర్ కుటుంబ సభ్యులు బీజేపీ వద్దకు వస్తే గేట్ వద్దే తన్ని తరిమేస్తాం,” అని మండిపడ్డారు. రాజకీయాల్లో సమీకరణాలు మారినా కొన్ని విలువలు మారవని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో సెటైర్లు వేసిన కొండా.. “కేసీఆర్‌కు కుటుంబమే ప్రథమం, పార్టీ రెండవది, తెలంగాణ చివరిది,” అని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల సందర్భాన్ని గుర్తు చేస్తూ, కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ అప్పుడే పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. “మేమైతే కవితను అరెస్ట్ చేశాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు కేసీఆర్, కేటీఆర్‌ను ఎవరినైనా అరెస్ట్ చేశాయా?” అని సూటిగా ప్రశ్నించారు.
Delhi Classroom Scam: సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలకు ఏసీబీ సమన్లు