Tipu Sultan: టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు..? కర్ణాటకలో మరో కాంట్రవర్సీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tipu Sultan: టిప్పు సుల్తాన్ ను ఎవరు చంపారు..? ఇప్పుడు కర్ణాటకలో మరో వివాదం ముందుకు వచ్చింది. కర్ణాకటలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి వీడీ సావర్కర్ వర్సెస్ టిప్పు సుల్తాన్ గా రాజకీయం కొనసాగుతోంది. బీజేపీ సావర్కర్ పేరుతో ఇతర పార్టీలపై విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ వొక్కలిగ వర్గాన్ని దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
టిప్పు సుల్తాన్ ను బ్రిటిష్, మరాఠా సైన్యం చంపలేదని ఇద్దరు వొక్కలిగ నాయకులు చంపారని బీజేపీ వాదిస్తోంది. ఈ వాదనపై బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. వొక్కలిగ నాయకులు ఊరిగౌడ, నంజే గౌడ ఇద్దరు చంపారని బీజేపీతో పాటు ఓ వర్గం అంటోంది. అడ్డంగ కరియప్ప రచించిన టిప్పు నిజకనాసుగలు( టిప్పు నిజమైన కలలు) పుస్తకం ఆధారంగా బీజేపీ ఈ వాదనలు చేస్తోంది. అయితే దీన్ని పలువరు చరిత్రకారులు వ్యతిరేకించినప్పటికీ, వొక్కలిగా బీజేపీ నాయకులు అయిన సీటీ రవి, మంత్రులు అశ్వత్ నారాయన్, గోపాలయ్య సమర్థించారు. ఊరి గౌడ, నంజే గౌడ గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్న వారిలో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే, అశ్వత్ నారాయణ వంటి బీజేపీ నేతలు కూడా ఉన్నారు.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
Read Also: UK: భారత జెండాను చూసి ఖలిస్తానీలకు మంట.. మరోసారి హైకమిషన్ పై దాడి..
వొక్కలిగా సామాజికవర్గం ఇప్పటి వరక కాంగ్రెస్, కుమారస్వామి పార్టీ జనతాదళ్ సెక్యులర్‌కు మద్దతుగా ఉంది. అయితే ఊరి గౌడ, నంజే గౌడ ఉనికిలో లేరని, కేవలం కల్పిత పాత్రలే కావొచ్చని రెండు పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రమంత్రి మునియప్ప నిర్మాతగా మారి.. ‘‘ఉరిగౌడ, నంజేగౌడ’’ సినిమా తీయనున్నట్లు చెప్పారు. వొక్కలిగ గురువుగా భావించే శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం ప్రధాన పీఠాధిపతి నిర్మలానందనాథ మహాస్వామీజీ సినిమా తీసేముందు దీనికి సంబంధించిన శాసనాలు, చారిత్రక ఆధారాలు మఠానికి సమర్పించాల్సిందిగా ఆదేశించారు.
టిప్పు సుల్తాన్ వేల మందిని చంపి బలవంతంగా మతం మార్చాడని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, జేడీయూలు ఈ వాదనలను తోసిపుచ్చుతున్నాయి. గతంలో టిప్పు జన్మదినోత్సవాన్ని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. తాజాగా ఈ అంశం ఎన్నికల ప్రధాన నినాదంగా మారింది. ఏప్రిల్-మేలో కర్నాటకలో 224 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ఇందులో బీజేపీ గెలిచి వరుసగా రెండవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!