భారతదేశంలో ఫేస్‌బుక్‌ను మూసివేస్తామని కర్ణాటక హైకోర్టు సోషల్ మీడియా దిగ్గజానికి వార్నింగ్ ఇచ్చింది.. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్నకట్టె నివాసి కవిత సమర్పించిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం ఈ వార్నింగ్ ఇచ్చింది.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఒక కారణం అయింది. గత ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించారు.
Karnataka High Court: అనుమానంతో తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురిని హత్య చేసిన వ్యక్తికి కర్ణాటక హైకోర్ట్ ధర్వార్డ్ బెంచ్ మరణశిక్ష విధించింది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మరణాలకు దారితీసిన ఈ నేరాన్ని కూరత్వంతో పోలుస్తూ అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. బరువెక్కిన హృదయంతో ట్రయర్ కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడం తప్పితే మాకు మరో మార్గం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
Karnataka: ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఈ పథకాన్ని ఆదివారం సీఎం సిద్ధరామయ్య ప్రారంభించనున్నారు.
Karnataka: 2024 లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడేందుకు చర్చలు జరుగుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలు విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నాయి. అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఈ సారి మోడీని గద్దె దించవచ్చని భావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే బీజేపీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం లేని పార్టీని దేశంలో చూపించండి అంటూ దేవెగౌడ సవాల్ విసిరారు. దేశం మొత్తంలో ఒక్కపార్టీనైనా చూపించాలని, అప్పుడు నేను సమాధానం చెబుతానని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న విపక్ష ఐక్యత ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు దేవెగౌడ మంగళవారం సమధానమిచ్చారు.
కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఉప ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఉప ఎన్నికలు జూన్ 30న జరుగుతాయని తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై జిల్లా స్థాయిలో బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలతో జరిగిన అంతర్మథన సమావేశం తర్వాత బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బొమ్మై ఆరోపించారు. వారిని వ్యతిరేకించే ప్రతి గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తూ వాక్‌స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు.. నేను చెబుతున్నాను.. ప్రజలు త్వరలో ఎమర్జెన్సీ వంటి పరిస్థితిని చూస్తారు’ అని బొమ్మై జోస్యం చెప్పారు.
భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా మార్మాంగాలను కోసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ పాశవిక ఘటన కర్ణాటకలోని యశ్వంతపురలో చోటుచేసుకుంది. భార్య.. తన అక్క కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ భర్త ఈ కిరాతకానికి ఒడిగట్టాడు.. కనీసం నిజా నిజాలు తెలుసుకోకుండా క్షణికావేశంలో హత్య చేశిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు బసవేశ్వర నగర్…