Virat Kohli In Trouble: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు విరాట్ కోహ్లీనే ప్రధాన కారణమని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Mohandas Pai: కన్నడ భాషపై కొనసాగుతున్న వివాదంపై ప్రముఖ టెక్ ఇన్వెస్టర్, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ స్పందించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో పని చేసే ఉద్యోగులు స్థానిక భాష నేర్చుకోవాలని సూచించారు.
Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడగా.. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచి బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆర్సీబీ ప్లేయర్స్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమానాశ్రయంలో స్వయంగా కలిసి అభినందనలు చెప్పారు.
Thuglife : కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో తన సినిమా థగ్ లైఫ్ ను రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. కన్నడ భాష వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా కమల్ హాసన్ తరఫున లాయర్ ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. థగ్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆయన థగ్ లైఫ్ మూవీని బ్యాన్ చేయాలంటూ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కర్ణాటక హైకోర్టను ఆశ్రయించింది. ఈ…
Viral Video: బెంగళూర్‌లో ఒక మహిళ ఆటో డ్రైవర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఈ సంఘటనలో మహిళను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పంఖూరి మిశ్రా అనే మహిళ డ్రైవర్ లోకేష్‌ను చెప్పుతో కొట్టింది. పంఖూరి తన భర్తతో బైక్‌పై వెళ్తున్న సమయంలో, ఆటో డ్రైవర్ తన కాలుపై నుంచి పోనిచ్చాడని ఆమె ఆరోపించింది.
Karnataka: కర్ణాటక బెళగావిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆరుగురు నిందితులు బాలికపై రెండుసార్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ చర్యని వారు మొబైల్ ఫోన్లో వీడియో తీసి బాలికను బ్లాక్మెయిల్ చేశారు. ఈ బ్లాక్మెయిల్ బాలిక రెండోసారి గ్యాంగ్ రేప్‌కి గురవ్వడానికి కారణమైంది.
Kamal Haasan: స్టార్ యాక్టర్ కమల్ హాసన్ ఇటీవల తన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అని ఆయన వ్యాఖ్యానించడంపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకుంది. కమల్ హాసన్ సినిమాను రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని రాజకీయ పార్టీలు హెచ్చరించాయి.