కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రకటన చేశారు. డీకే. శివకుమార్‌కు 100 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు మీడియాతో చెప్పారు. దీంతో హైకమాండ్ పెద్దలు రంగంలోకి దిగి చర్చలు కూడా జరిపారు.
ఇది కూడా చదవండి: Pragya Jaiswal : బికినీలో మొత్తం చూపిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
తాజాగా ఇదే అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఊహాగానాలకు తెరదించుతూ ఒక జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు. ఐదేళ్ల పాటు తాను ముఖ్యమంత్రిగా ఉంటానని తేల్చి చెప్పారు. నాయకత్వ మార్పుపై ఊహాగానాలను తోసిపుచ్చారు. డీకే.శివకుమార్‌కు ఆశయాలు ఉండొచ్చు.. అలా చాలా మందికి కూడా ముఖ్యమంత్రి పోస్టుపై ఆశ ఉండొచ్చని తెలిపారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని.. ఐదేళ్లు తానే ఉంటానని పేర్కొన్నారు. అసంతృప్తిపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: పవన్ కల్యాణ్ సవాల్‌ను స్వీకరించిన లోకేష్.. నేను రెడీ..!
2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొదటి నుంచి ముఖ్యమంత్రి పోస్ట్‌పై వివాదం నడిచింది. తొలుత డీకే.శివకుమార్ పేరే వినిపించింది. కానీ చివరికి సిద్ధరామయ్యకే ఆ పదవి వరించింది. అప్పట్నుంచీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అదే పంచాయితీ చోటుచేసుకోవడంతో కర్ణాటకలో పొలిటికల్ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఇన్‌చార్జ్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా అసంతృప్తి ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.
ప్రస్తుతం హైకమాండ్‌ను కలిసేందుకు సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. గురువారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్‌తో ఇద్దరూ సమావేశం కానున్నట్లు వర్గాలు తెలిపాయి. ఇక గురువారం సాయంత్రం రాహుల్ గాంధీని డీకే.శివకుమార్ కలవనున్నారు.