కాంగ్రెస్ రాష్ట్రాల్లో కమిషన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారిగా కేంద్రమంత్రి నియమింపబడ్డారు. ఇందుకోసం ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని.. అక్కడ కర్ణాటక, ఇక్కడ తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎమ్‌లా మార్చుకున్నాయని ధ్వజమెత్తారు. ఇచ్చిన గ్యారంటీలను కూడా అమలు చేసే దిక్కు లేదని ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వ పాలన అగమ్యగోచరంగా ఉందని పేర్కొ్న్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను.. తెలంగాణలో అభివృద్ది ఎక్కడా? అని ప్రశ్నించారు. ఢిల్లీ హైకమాండ్‌కి పైసలు పంపాలి… హైకమాండ్‌ను ఖుషీ చేయాలి.. ఇదే తెలంగాణ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న పని అని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ సర్కారు కూడా ఇదే చేస్తోందని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 50 శాతం కమిషన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: JIGRIS : మ్యాడ్ బాయ్ రామ్ నితిన్ ‘జిగ్రీస్’ ఫస్ట్ లుక్ రిలీజ్
కార్యకర్తలు, నేతల అభీష్టం మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని శోభా కరంద్లాజే తెలిపారు. ఇప్పటికే అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందని… మరోసారి మాట్లాడుకుంటామని చెప్పారు. మధ్యాహ్నం తర్వాత నామినేషన్ స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ఇది పార్టీల మధ్య రాజకీయ ఎన్నిక కాదని.. పార్టీ సంస్థాగత ఎన్నిక కాబట్టి ఏకగ్రీవమే ఉంటుందని చెప్పారు. ఘర్షణ ఉండదు… ఏకాభిప్రాయంతోనే ముందుకు పార్టీ వెళ్తుందని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Janhvi Kapoor : మీడియా పై మండిపడుతున్న జాన్వీకపూర్..
ఇక సోమవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్‌రావు నామినేషన్ వేయనున్నారు. రామచందర్‌రావు బీజేపీలో చాలా కాలంగా క్రియాశీలంగా ఉన్న నేత. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్న ఆయన, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కూడా. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవంతో పాటు, పార్టీలో వివిధ స్థాయిలలో నిర్వహణలో పాల్గొన్న ఆయనకు బలమైన మద్దతు ఉంది.