క్షణికావేశంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం విషాదాన్ని నింపింది. అప్పటి దాకా కలిసి మెలిసి తిరిగిన సహచర విద్యార్థిని విగతజీవిగా మారిపోవడంతో ఆ యువతుల గుండెలు తట్టుకోలేకపోయాయి. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోయాయన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
Kamal Haasan : కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కన్నడ భాషపై చేసిన కామెంట్లు కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మొన్న కర్ణాటకకు వెళ్లినప్పుడు భాషపై కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లే కమల్ హాసన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎందుకంటే అప్పటి నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటక…
Mangaluru Murder: కర్ణాటక కోస్తా ప్రాంతంలో జరుగుతున్న హత్యలు ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య జరిగింది. దీని తర్వాత, తాజాగా సోమవారం, బంట్వాల్ తాలూకాలోని ఇరా కోడి సమీపంలో పికప్ డ్రైవర్, కోల్తమజలు జుమ్మా మసీదు కార్యదర్శి 32 ఏళ్ల అబ్దుల్ రెహమాన్ పట్టపగలు నరికి చంపబడ్డాడు. ఈ దాడిలో అతడి సహచరుడు కలందర్ షఫీ (29) తీవ్ర గాయాలపాలయ్యారు.
కన్నడ భాషపై అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన నటించిన కొత్త సినిమా ‘థగ్ లైఫ్’ను బ్యాన్ చేయాలంటూ కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Kamal Haasan: భాషాభిమానానికి కర్ణాటక, తమిళనాడు పెట్టింది పేరు. అలాంటి చోట భాష గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. కానీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహానికి కారణమవుతున్నాయి. చెన్నైలో జరిగిన ఆయన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అని ఆయన చేసిన కామెంట్స్‌పై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు.
Shocking news: పిల్లలు పుట్టడం లేదని, వివాదాల కారణంగా 30 ఏళ్ల వైద్యురాలిని అత్తమామలే దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను కప్పిపుచ్చడానికి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో జరిగింది. డాక్టర్ రేణుక సంతోష్ హోనకాండేని ఆమె అత్తమామలు జయశ్రీ, కామన్న హోనకాండే హత్య చేశారు. భర్త కూడా హత్యకు కుట్ర పన్నినట్లు పోలీస్ విచారణలో తేలింది.
Mangaluru: కర్ణాటక కోస్తా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తతెల్తాయి. బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య తర్వాత మరో హత్య చోటు చేసుకుంది. వారాల వ్యవధిలోనే ఈ రెండు హత్యలు జరగడం స్థానికంగా ఉద్రిక్తతల్ని పెంచాయి. సోమవారం, బంట్వాల్ తాలూకాలోని ఇరా కోడి సమీపంలో పికప్ డ్రైవర్, స్థానిక మసీదు కార్యదర్శి అయిన 42 ఏళ్ల ఇంతియాజ్ పట్టపగలు నరికి చంపబడ్డాడు.
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా యాక్టివ్ కేసులు 1000 దాటాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసి గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ ప్రకారం, కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 209, ఢిల్లీ 104 యాక్టివ్ కేసులతో మూడవ స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య…
Mysuru Suicide: కర్ణాటక రాష్ట్రం మైసూరు తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రేమ కుటుంబాన్నే బలి తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులతో పాటు చిన్న కూతురు హెబ్బల్హా జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
BJP: రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పాలన పట్ల కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్లు తాజాగా సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే చెప్పింది. అయితే, ఇప్పటికీ సిద్ధరామయ్య రాష్ట్రంలో అత్యధిక మంది ఇష్టపడే ముఖ్యమంత్రి ఫేస్‌గా ఉన్నారని సర్వే చెప్పింది.