ఒడిశాలో జరిగిన ఘోర సంఘటనను మరువక ముందే బెంగళూరులో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులపై తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, బ్లాక్ మెయిల్ చేశారని కాలేజీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దాదాపుగా 100 మంది ఎమ్మెల్యేలు డీకే.శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నారని ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. సిద్ధరామయ్యపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో ‘‘అవినీతి రేటు కార్డు’’ ప్రకటనపై బీజేపీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రకటన చేశారు. డీకే. శివకుమార్‌కు 100 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు మీడియాతో చెప్పారు.
కర్ణాటక రాష్ట్రాన్ని ఆకస్మిక మరణాలు హడలెత్తిస్తున్నాయి. ఎక్కువగా యువకులే గుండెపోటుతో మరణిస్తున్నారు. గత జూన్ నెలలో హసన్ జిల్లాలో 23 మంది హార్ట్ఎటాక్తో ప్రాణాలు కోల్పోయారు.
Bengaluru: బెంగళూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య గొడవ భార్య హత్యకు దారి తీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం కారణంగా కోపంతో భర్త భార్యను హత్య చేశాడు. భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో చనిపోయే వరకు తొక్కుతూ చంపాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది... దీంతో పెద్ద ఎత్తున వచ్చి ఇన్‌ఫ్లో రూపంలో తుంగభద్ర డ్యామ్‌లోకి వచ్చి చేరుతుంది.. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
ఐదేళ్లు తానే కర్ణాటక సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా. మీకెందుకు అలాంటి డౌట్స్ ఉన్నాయి? అని మీడియాను ప్రశ్నించారు.
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి మార్పు అంశం కాకరేపుతోంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని డీకే.శివకుమార్ మద్దతుదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారు.
కాంగ్రెస్ రాష్ట్రాల్లో కమిషన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారిగా కేంద్రమంత్రి నియమింపబడ్డారు.