Woman Kills Husband: దేశవ్యాప్తంగా మగాళ్లకు భద్రత లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయా..? అనే అనుమానం వచ్చేలా హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ భర్తల్ని ప్రియుడితో కలిసి చంపేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. దీనికి తాజాగా ఉదాహరణ, ఇటీవల మేఘాలయాలో జరిగిన రాజా రఘువంశీ హత్య. భార్య సోమన్ తన లవర్ రాజ్ కుష్వాహాతో ప్లాన్ చేసి హత్య చేసింది. తాజాగా, కర్ణాటకలో కూడా ఇలాంటి ఘోరమే మరోకటి జరిగింది. ఒక మహిళ…
కర్ణాటకలో ఒకేసారి ఐదు పులులు మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. పోస్ట్మార్టం రిపోర్టులో విషాహారం తిని చనిపోయినట్లుగా తేలింది. దీంతో ఎవరో కావాలనే ఈ పని చేసి ఉంటారని ఫారెస్ట్ అధికారులు భావించారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. అభయారణ్యంలో వన్యప్రాణుల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. విషప్రయోగం ప్రయోగించడంతో ఐదు పులులు మృత్యువాత పడ్డాయి. కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్లోని హూగ్యం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Karnataka: చేయని హత్యకు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి, ఇప్పుడు తనను ఈ కేసులో ఇరికించిన పోలీసు అధికారులపై చర్యలకు సిద్ధమయ్యాడు. తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై దాదాపు రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడిన ఒక గిరిజన వ్యక్తి, తనను తప్పుడు కేసులో ఇరికించిన అధికారులపై రూ.5 కోట్ల పరిహారం, క్రిమినల్ చర్యల్ని కోరుతూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించాడు.
Karnataka: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణ పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనను కర్ణాటక క్యాబినెట్ ఈ రోజు ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే అన్ని హౌసింగ్ పథకాల్లో ముస్లింలకు ప్రత్యేక కోటాను మంజూరు చేసింది. మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లను ప్రస్తుత 10 శాతం నుండి 15 శాతానికి పెంచే ప్రతిపాదనకు గృహనిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మద్దతు ఇచ్చారు.
కర్నాటకలో హోసకోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందారు.. తిరుపతి నుండి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసి బస్సు ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. దీంతో, బస్సులో ఉన్న కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4) మరియు (1) సంవత్సరం చిన్నారి కూడా ప్రాణాలు విడిచింది.
కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణను చేపడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలో పూర్తైంది. అయితే కర్ణాటకలో మాత్రం కులగణన సర్వేపై విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో ఈ సర్వేపై వొక్కలిగ,లింగాయత్ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ సర్వేలో న్యాయమైన ప్రాతినిధ్యం లేదని వారు ఆరోపించారు. Also Read:Honeymoon Murder: భర్తని చంపి సోనమ్ ఎలా తప్పించుకుంది.. పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చింది..? ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం…
Corona Virus: కరోనా వైరల్ మరోసారి దేశ ప్రజల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. భారత్లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 6 వేల 133 కు చేరుకుంది. అంతే కాదు, గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదు కాగా.. ఆరుగురు కోవిడ్ తో మృతి చెందారు.
Suhas Shetty Murder Case: గత నెలలో కర్ణాటకలోని మంగళూర్లో మాజీ భజరంగ్ దళ్ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య సంచలనం సృష్టించింది. ఈ హత్య తర్వాత కోస్తా కర్ణాటక ప్రాంతంతో తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేయనుంది.
Karnataka: ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్త కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్ చేయగా.. అది కాస్త బెడిసి కొట్టింది. భర్త అలర్ట్ కావడంతో ఆ ఫ్యామిలీ బతికి బట్ట కట్టింది.