కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్షాల సమావేశంలో 26 పార్టీలకు చెందిన 53 మంది నేతలు హాజరు అయ్యారు. రేపటి అజెండా 6 ముఖ్యమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఉమ్మడి కనీస కార్యక్రమాలను రూపొందించేందుకు సబ్ కమిటీ ఏర్పాటుతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇది విపక్షాల పొత్తుల వారధిగా నిలువనుంది. కూటమి పరిణామాల గురించి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి పని చేస్తారు. కూటమి ఉమ్మడి కార్యక్రమాల ప్రణాళిక కోసం సబ్‌కమిటీ ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేనట్లుంది.. అందుకే తాను విపక్షాల మహాకూటమిలో చేరే ప్రసక్తి లేదని అన్నారు. ఇక, ఇదే టైంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
Bengaluru: బెంగళూర్ లో దారుణం జరిగింది. ఓ టెక్ కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్లు హత్యకు గురయ్యారు. మంగళవారం బెంగళూర్ లో జరిగి ఈ జంట హత్యలు కలకలం రేపాయి.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. అభంశుభం తెలియన 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులంతా మైనర్లే. నిందితులు 10 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నవారే. చిన్నవయస్సులోనే ఇలాంటి అఘయిత్యానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
డబ్బుల విషయంలో ఈ మధ్య కాలంలో హత్యలు పెరిగిపోతున్నాయి. డబ్బులు ఇచ్చిన వారు.. తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు దాడులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన వారు.. డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారినే హత్య చేస్తున్నారు.
సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో పార్టీకి సంబంధంలేనివారు కూడా వచ్చి పాల్గొంటూ ఉంటారు. కొన్ని సందర్భల్లో పార్టీ సమావేశాల్లోకి సైతం కొత్త వ్యక్తులు వస్తుంటారు. అలా వచ్చిన వారిని పార్టీ నేతలు గుర్తించి బయటకి పంపిస్తుంటారు.
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నీటిమయం అవుతున్నాయి..కర్ణాటక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. భారీ వర్షాలు కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 8కి చేరుకుంది. గత 24 గంటల్లో దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో కురిసిన వర్షాలకు మొత్తం 35 ఇళ్లు ధ్వంసమయ్యాయి.. చాలా మంది తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు..దక్షిణ కన్నడ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇదే సమయంలో మెస్కాంకు చెందిన 108 విద్యుత్ స్తంభాలు,…
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం 2023-2024 ప్రభుత్వ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో, మొత్తం 18 శ్లాబ్‌లపై ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్)పై ప్రస్తుతం ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు.
Tomato stolen: ఎప్పుడూ లేని విధంగా టమాటా రేట్లు పైపైకి వెళ్తున్నాయి. రాకెట్ వేగంతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర సెంచరీని దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో ధర రూ. 150కి పైగానే పలుకుతోంది. దీంతో సామాన్యుడు టమాటా కొనలేని పరిస్థితి ఉంది.