Dogs Temple: సాధారణంగా మొక్కులను తీర్చుకోవడానికి గుళ్లకు, మసీదులకు, చర్చిలకు వెళతారు. ఒక్కో మతం వారు.. వారి నమ్మకాల మేరకు అలా తాము కోరుకున్నవి జరగాలని మొక్కు కుంటారు.. మొక్కులు తీరాక వారు గుడికి, మషీదు, చర్చికి వెళ్ల తమ మొక్కులను తీర్చుకుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ అక్కడ కుక్కలకు గుడి కట్టారు. ఆ గుడికి వెళ్లి మొక్కితే తమ కోర్కెలు తీరుతాయని వారు నమ్ముతున్నారు. అలా కుక్కకు కట్టిన దేవాలయంలో ఏడాదికి ఒకసారి పండుగ కూడా నిర్వహిస్తున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుందనేగా మీ సందేహం.. ఇదిగో వివరాలు..
Read also: Vivek Agnihotri: ప్రభాస్‌తో నాకు పోలికేంటి? ఎవడ్రా రాసింది ఇది?
కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదేమో. కాస్త ప్రేమ చూపిస్తే చాలు యజమానుల కోసం కుక్కలు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకడుగువేయవు. అందుకే పెంపుడు కుక్కలను చాలామంది ఇంట్లో మనిషిలాగే చూసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఈ అలవాటు నగరాలు, పట్టణాలో మరీ ఎక్కువైంది.. వారి సంరక్షణ కోసం ప్రత్యేకంగా పెట్ ఆసుపత్రులు కూడా వెలిశాయి. అటువంటి విశ్వాసం గల కుక్కలకు కర్ణాటకలో గుడి కట్టి పూజిస్తున్నారు. కర్ణాటకకు చెందిన చన్నపట్న అనే ప్రాంతంలో ఏకంగా కుక్కలకు గుడి కట్టించారు. సాధారణ దేవాలయాల్లాగే ఇక్కడ కూడా ప్రతిరోజూ పూజలు జరుగుతాయి. సాధారణంగా అందరూ దేవుడిని పూజిస్తే ఇక్కడ మాత్రం కుక్కలకు గుడికట్టి మరీ పూజిస్తున్నారు. గ్రామ దేవతకు ముందు ఈ శునకాలకే తొలిపూజలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని చన్నపట్న అనే నగరంలో అగ్రహార వలగెరెహల్లి అనే చిన్న గ్రామంలో ఈ శునక దేవాలయం ఉంది. ఊరి ప్రధాన దేవత కెంపమ్మ ఆలయాన్ని నిర్మించిన కొన్ని నెలలకే ఆ గ్రామానికి చెందిన రెండు కుక్కలు అకస్మాత్తుగా అదృశ్యం అయ్యాయట.
Read also: AP High Court: బిగ్‌బాస్ షోను సెన్సార్ చేయకపోతే ఎలా?.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకి ఓ వ్యాపారవేత్త కలలోకి వచ్చిన గ్రామ దేవత.. గ్రామస్తుల రక్షణ కోసం తన ఆలయానికి దగ్గరగా కనిపించకుండాపోయిన ఆ కుక్కల కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని కోరిందట. ఆ రకంగా రెండు శునకాల విగ్రహాలను ప్రతిష్టించి గుడిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా శునకాల పేరుతో ప్రతి ఏడాది పండగ కూడా నిర్వహిస్తున్నారు. ఆనోటా ఈ నోటా విషయం తెలిసి ఈ గుడికి మంచి పాపులారిటీ రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా టూరిస్టులు కూడా వచ్చి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.