చదువు నేర్పించాల్సిన గురువు బాలికపై దారుణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. బాలికకు బాగాలేదని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో ప్రిన్సిపాల్ అత్యాచారం చేశాడు.. అస్వస్థతకు గురైన చిన్నారిని, వైద్యం పేరుతో ఇంటికి తీసుకెళ్లి ఈ అగాయిత్యానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గపు ప్రిన్సిపాల్.. రెండో తరగతి చదువున్న విద్యార్థి అనుకోకుండా అస్వస్థకు గురైంది.. అయితే 10 ఏళ్ల చిన్నారి అస్వస్థకు గురైందని తెలుసుకున్న ప్రిన్సిపాల్ తరగతి గదికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం తన ఇంటికి తీసుకెళ్లాడు. అదే సమయంలో ఈ దుర్మార్గానికి పాల్పడ్డట్లు పోలీసులు కేసు నమోదు చేశారు..
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఓ స్కూల్‌లో వెలుగు చూసింది.. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో.. చిన్నారి పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక భయాందోళనకు గురై పాఠశాల పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి ప్రిన్సిపాల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు..
సాయంత్రం స్కూల్ అయిపోయిన సమయానికి ఇంటికి వచ్చింది బాలిక.. బాలిక కడుపునొప్పితో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. అండర్‌గార్‌మెంట్‌లో రక్తస్రావాన్ని చూసిన తల్లి ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది.. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత, నెమ్మదిగా అమ్మాయి తన తల్లికి జరిగిందంతా చెప్పింది. బాలిక తల్లిదండ్రులు నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.. ఇలాంటి వాడిని ఊరికే వదిలిపెట్ట వద్దని స్కూల్ లోని పిల్లల పేరెంట్స్ పోలీస్ స్టేషన్ వద్ద డిమాండ్ చేస్తున్నారు.. చిన్నారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు..