కర్ణాటకలోని చిత్రదుర్గలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగుచూసింది. 20 ఏళ్ల యువకుడు తన తాతను కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వాలని అడిగాడు. ఈ క్రమంలో ఆయన మొబైల్ ఫోన్ కొనడానికి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
కట్టుకున్న భార్య, కన్న కొడుకు ఇద్దరూ కలిసి ఆ ఇంటి పెద్దను దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలో మాండ్యా జిల్లాలోని ఓ గ్రామంలో ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను హత్య చేసింది.
Karnataka: అతి వేగం ప్రమాదకరం. వాహనాన్ని అతి వేగంగా నడపడం వల్ల వాహనం నడుపుతున్న వారికే కాదు ఇతర వాహన ధారులకి అలానే కాలినడకన వెళ్లే వాళ్ళకి కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగళూరులో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఐదుగురి పైకి ఒక కారు దూసుకెళ్లింది. లేడీహిల్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఇద్దరు మహిళలు, ముగ్గురు…
DK Shiva Kumar: కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కి కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేసిన డీకే శివకుమార్‌కి ఊహించని ఎదురుదెబ్బ తాకింది. ఆయన అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ టీమ్ పనిచేస్తోందని ఆయన అన్నారు.
Honour killing: మరో పరువు హత్యకు 20 ఏళ్ల యువతి బలైంది. కులాంత సంబంధం పెట్టుకుందని 20 ఏళ్ల కూతురిని తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈఘటన కర్ణాటకలోని దేవనహళ్లీ తాలూకాలోని బిదలూర్ గ్రామంలో బుధవారం జరిగింది. దళిత వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందకు కూతురుని హత్య చేశాడు. తక్కువ కులానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించినప్పటికీ, మారకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు.
Bigg Boss: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు వివాదంగా మారాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయడంతో దుమారం చెలరేగింది. ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా రియాలిటీ షోలోకి ప్రవేశించినట్లుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి.
Karnataka: బెంగుళూరు రూరల్ జిల్లాలోని హోస్కోట్లో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. బిర్యానీ దుకాణం యజమాని వస్తు సేవల పన్ను (జిఎస్టి) కట్టకుండా ఎగవేసినట్లు వారు గుర్తించారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని మృత్యువు కబలించింది.. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జయింది.. సోమవారం సాయంత్రం ఇక్కడికి సమీపంలోని చిత్రదుర్గ-షోలాపూర్ NH 50పై రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జు కావడంతో హోసపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతులు.. హోసపేట సమీపంలోని ఉక్కడకేరికి చెందిన గోనిబసప్ప (65), కెంచమ్మ (80), భాగ్యమ్మ (30), యువరాజ్ (5),…
కర్ణాటక రాజధాని బెంగళూరులోని అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో షాపు యజమాని సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.