Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
- ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్
- ₹2,278 కోట్లతో మెగా ప్రాజెక్ట్
- ఉత్తర తెలంగాణకు కొత్త ఊపు
- 2026 నాటికి పనులు పూర్తి లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్‌లో రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో ‘ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణ రూపురేఖలను మార్చే గేమ్‌చేంజర్‌గా నిలవడమే కాకుండా ప్రాంతీయ పురోగతికి సరికొత్త శకాని నాంది పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు.
2,009 ఎకరాల్లో అత్యాధునిక ఏవియేషన్ హబ్
మొత్తం 2,009.23 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌లో అత్యాధునిక మౌలిక వసతులను కల్పించనున్నారు. సివిల్ ఏవియేషన్ (సాధారణ విమాన ప్రయాణాలు) తో పాటు కార్గో రవాణా, ఎంఆర్ఓ (Maintenance, Repair, and Overhaul) సదుపాయాలను ఇక్కడ ఏకకాలంలో అందుబాటులోకి తేనున్నారు. రక్షణ రంగంతో పాటు పౌర విమానయాన అవసరాలను తీర్చేలా ఈ ప్రాజెక్ట్‌ను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నారు.
Also Read
పారిశ్రామిక, పర్యాటక రంగాలకు విపరీతమైన ఊతం
ఈ ఎయిర్‌ఫీల్డ్ అందుబాటులోకి రావడం వల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక ఉత్పత్తుల వేగవంతమైన రవాణాకు బాటలు పడనున్నాయి. ముఖ్యంగా కార్గో సదుపాయం కలగడం వల్ల ప్రాంతీయ వ్యాపార, వాణిజ్య రంగాలు పుంజుకోవడంతో పాటు పర్యాటక రంగానికి విశేష ప్రజాదరణ లభించనుంది. రక్షణ , పౌర విమానయాన రంగాలు ఒకే చోట చేరడం ద్వారా స్థానికంగా వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
2026 డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి భూసేకరణ , అవసరమైన మౌలిక వసతుల మార్పిడి పనులను 2026 డిసెంబర్ 31 నాటికి సంపూర్ణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణ వల్లే ఉత్తర తెలంగాణ సుదీర్ఘ కల నెరవేరుతోందని, ఇది రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో మైలురాయిగా నిలిచిపోతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!