చోరీకి కాదేది అనర్హం అన్న తీరుగా దేశంలో పరిస్థితి తయారైంది. ఎక్కడ చూసినా దొంగలు అవాక్కయేలా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.
Bengaluru Bus Shelter: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో అసెంబ్లీకి 1 కిలోమీటరు దూరంలో బీఎంటీసీ బస్సు కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ చోరీకి గురైంది. ఈ షెల్టర్ నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.
ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను కన్నడ నటుడు కారుతో ఢీకొట్టాడు. దీని కారణంగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా భార్య చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కారణమైన నటుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో కొన్ని చిత్రాల్లో నటించిన నాగభూషణ శనివారం రాత్రి తన కారులో ఉత్తరహళ్లి నుంచి కోననకుంట వైపు డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాడు. కారు వేగంగా నడుపుతున్నాడు నాగభూషణ. రాత్రి 9.45 గంటల సమయంలో వసంత పుర…
Cauvery Water Dispute: తమిళనాడుకు కావేరీ నదీ జలాల విడుదలకు వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి. వీటన్నింటి మధ్య శుక్రవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు.
Section 144 imposed in Karnataka over Cauvery Issue: కర్ణాటకలో నేడు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ.. కన్నడ, రైతు సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు మద్దతుగా హోటళ్లు, విద్యా-వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, ప్రైవేటు సంస్థలు అన్నీ మూతబడ్డాయి. మరోవైపు బస్సులు డిపోలకే పరిమితం కాగా.. ట్యాక్సీలు, ఆటోలు కూడా నిలిచిపోయాయి. ఇక బెంగళూరు విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం 44 విమాన…
మాములుగా దేవాలయాలకు దెయ్యాలు వెళ్లవు.. దేవుడి పేరు చెప్పగానే ఆమడ దూరం పారిపోతాయి.. అలాంటిది దెయ్యాలు అన్ని కలిసి ఓ శివాలయాన్ని నిర్మించాయి అంటే నమ్ముతారా?.. అలా జరిగే ఛాన్స్ లేదని అనుకుంటారు.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.. మీరు విన్నది అక్షరాల నిజమే ఓ శివాలయాన్ని దెయ్యాలు నిర్మించాయి.. ఆ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఆ ఆలయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇది వినడానికి విచిత్రంగా, వింతగా ఉన్న…
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్డీ కుమారస్వామి బుధవారం బెంగళూరులో కావేరీ నీటి సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకుంది. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయొద్దంటూ బెంగళూరు వ్యాప్తంగా కర్ణాటక జలసంరక్షణ సమితి, వివిధ రైతుసంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి కావేరీ నదీ జలాల వివాదం తెరమీదకు వచ్చింది. అసలు ఈ వివాదం ఏంటి.. ఎప్పుడు ప్రారంభమైందంటే..
కర్ణాటక జల సంరక్షణ సమితి, ఇతర రైతు సంఘాలు మంగళవారం బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. తమిళనాడుకు కావేరీ జలాలను కర్ణాటక విడుదల చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బెంగళూరులో బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు తనను సంప్రదించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు. అలాగే కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్లు ఆ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.