JDS: కర్ణాటకలో పాత మిత్రుడితో మళ్లీ జేడీఎస్ జతకట్టింది. బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదరింది. రెండు రోజుల క్రితం జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, అతని కుమారుడు నిఖిల్ గౌడ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఎన్డీయేలో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జేడీఎస్, బీజేపీల మధ్య పొత్తు చిగురించింది. రెండు పార్టీలు కలిసికట్టుగా 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని…
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత ఎంకే అళగిరి సహాయకుడిపై బెంగళూరులోని ఓ రెస్టారెంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన మృతి చెందారు. ఈ దాడి ఘటన సెప్టెంబర్ 5న జరిగింది. దాడి చేసిన అనంతరం బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా.. మృతి చెందాడు. మృతుడు వీకే గురుస్వామి మూర్తిగా(64) గుర్తించారు.
Cauvery row: కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు తప్పుపడుతున్నారు. నీటి విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూర్ బంద్ కి పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే మరోవైపు మాండ్యా జిల్లాలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరికొన్ని సంఘాలు బందుకు పిలుపునిచ్చే యోచనలో ఉన్నాయి.
JDS: మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) రేపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్ణాటక మాజీ సీఎం, దేవెగౌడ కొడుకు కుమారస్వామి గురువారం పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనట్లు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే ఈ దిశగా సీట్ల పంపకాలపై కూడా ఇరు పార్టీలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రామంలో 14 మంది మైనర్ బాలికలు మణికట్టు కోసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లే బాలికల ఎడమచేతి మణికట్టుపై గాయాలు ఉండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలికలంతా దండేలి ప్రాంతానికి, ఒకే పాఠశాలకు చెందిన 9,10 తరగతి విద్యార్థులే అని తేలింది. వారి మణికట్టుపై రేజర్ కోతలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్య ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.. ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్న హుక్కా బార్లపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిషేధం విధించాలని యోచిస్తోంది. దీంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.. స్కూల్ పిల్లలు కూడా హుక్కా బార్లకు వస్తున్నారని, ఈ పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు చట్టం తేవాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్య…
UNESCO: యునెస్కో(UNESCO) ప్రపంచ వారతసత్వ సంపదలో మరో రెండు భారతీయ ప్రదేశాలకు చోటు లభించింది. దీంతో భారత్ నుంచి ఈ జాబితాలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల సంఖ్య 42కి చేరింది. కర్ణాటక హొయసల రాజవంశానికి చెందిన ఆలయాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంతకుముందు రోజు పశ్చిమబెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతినికేతన్’ని వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో(UNESCO). ఈ విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తెలిపింది.
ప్రస్తుతం వినాయక చవితి సంబరాలు దేశ వ్యాప్తంగా మొదలైయ్యాయి.. రసాయన, ప్లాస్టిక్ రంగులతో పర్యావరణ కాలుష్యం అవుతుందని అధికారులు మట్టి విగ్రహాలను తయారు చెయ్యాలని, వాటిని నీటిలో నిమర్జనం చేసిన ఎటువంటి హానీ కలుగదని చెప్పినా జనాలు లెక్క చెయ్యడం లేదు.. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కర్నాటక ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP)తో తయారు చేసిన విగ్రహాలను తయారు చేయడం, విక్రయించడం మరియు నిమజ్జనం చేసే వారిపై పర్యావరణ (రక్షణ)…
Karnataka: కర్ణాటకలో ఫ్రెష్ గా మారో వివాదం రాజుకుంది. హుబ్బల్లిలోని వివాాదాస్పద ఈద్గా మైదనంలో గణేష్ విగ్రహానని ప్రతిష్టించడానికి అనుమతి కొరుతూ హిందూ కార్యకర్తలు స్థానిక, జిల్లా పరిపాలనను ఆశ్రయించారు.
కర్ణాటక లో ఘోర ప్రమాదం జరిగింది.. సోమవారం తెల్లవారు జామున చిత్రదుర్గ జిల్లాలో ని జాతీయ రహదారి-150పై కల్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కెకెఆర్టిసి) మరియు ట్రక్కు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా వ్యక్తులు మరణించారు.. మృతులను మాబమ్మ (35), రమేష్ (40), పార్వతమ్మ (45), నరసప్ప (5), రవి (23)గా గుర్తించారు. వీరంతా రాయచూరు జిల్లా వాసులు. మరో ఆరుగురికి గాయాలై చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గొల్లహళ్లి సమీపంలో తెల్లవారుజామున 3…