కర్ణాటకలో ఓ తల్లి ఘాతుకానికి పాల్పడింది. నవమాసాలు మోసి కని పెంచిన కన్నబిడ్డను అత్యంత దారుణంగా హతమార్చింది. అనంతరం తల్లి కూడా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘోరం శివమొగ్గలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టెక్ సిటీ బెంగళూరులో ప్రధాన రహదారులన్నీ గుంతలమయం అయ్యాయి. దీంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు రిపేర్ చేయాలంటూ ఇటీవల బెంగళూరు వాసులు ఆందోళన కూడా చేశారు. అలాగే ప్రతిపక్ష బీజేపీ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణకు జరిగే నష్టంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదని చెప్పారు. దక్షిణ తెలంగాణ లోని ఐదు జిల్లాలకు కృష్ణానది వర ప్రదాయిని అని అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆల్మట్టి…
కర్ణాటకలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గతంలో నగదు తరలిస్తున్న వాహనంపై దాడి చేసి భారీగా నోట్ల కట్టలు ఎత్తుకెళ్లిపోయారు. తాజాగా మరోసారి రెచ్చిపోయారు. ఎస్బీఐ బ్యాంక్లోకి చొరబడి.. సిబ్బందిని బెదిరించి రూ.58 కోట్ల విలువైన నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
సాండల్వుడ్ నటుడు ఉపేంద్ర మరియు నటి ప్రియాంక ఉపేంద్రల మొబైల్ ఫోన్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఘటన గురించి సమాచారాన్ని పంచుకుంటూ, నటుడు ఉపేంద్ర సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి, ఒక వార్నింగ్ మెసేజ్ జారీ చేశారు. ఈ వీడియోలో, తమ ఫోన్లు హ్యాక్ అయిన విషయాన్ని వెల్లడిస్తూ, తమ పేరుతో ఎవరైనా డబ్బు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని కోరారు. ఉపేంద్ర తన వీడియో సందేశంలో “అందరికీ నమస్కారం. మేము…
ఈ మధ్య కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యలు ఎక్కువైపోయారు.. రీసెంట్ గా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ భార్య తన లవర్ తో కలిసి భర్తపై హత్యాయత్నం చేసింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు.. ఆ భర్త బతికి బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని విజయపుర జిల్లాఇండి పట్టణంలో సునంద అనే మహిళ తన ప్రేమికుడి సహాయంతో తన భర్తను హత్య చేయడానికి ప్రయత్నించింది. నిద్రిస్తున్న భర్తను గొంతు కోసి చంపే…
Dharmasthala: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల వార్తల్లో ప్రధానాంశంగా మారింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే హోరు. హిందువులకు ఎంతో పవిత్రమైన స్థలంలో వందలాది మృతదేహాలను బలవంతంగా ఖననం చేశానని అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడం సంచలనంగా మారింది.