Karnataka Congress Crisis: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి మార్పుపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు బహిర్గతం అయింది. ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. నాయకత్వ మార్పు అనివార్యమైతే, డీకేఎస్ తదుపరి సీఎంగా 200 శాతం బాధ్యతలు చేపడతారని ఆయనకు మద్దతిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also: India-China: ముమ్మాటికీ అరుణాచల్ మాదే.. చైనా వ్యాఖ్యల్ని ఖండించిన భారత్
ఇక, డీకే శివకుమార్ వర్గానికి చెందిన పలువురు శాసన సభ్యులు తమ డిమాండ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానానికి విన్నవించేందుకు ప్రత్యేకంగా ఢిల్లీకి పయనం అవుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హైకమాండ్‌కు వారు గుర్తు చేస్తున్నారు. అధికార భాగస్వామ్యంపై గతంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్థానంలో పార్టీ వేరే వ్యక్తిని ఎంపిక చేయాలని భావిస్తే, డీకే శివకుమారే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు, ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.
Read Also: IND vs SA: లక్ష్యం 549, ప్రస్తుతం 27/2.. భారత్ రోజంతా నిలవగలదా?
అయితే, కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై తుది నిర్ణయం ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్ఠానం చేతుల్లోనే ఉంది. కానీ, ఈ అంశంపై బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని, ఇటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హైకమాండ్ ఇరు వర్గాల ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు తెలుస్తుంది. కాగా, కర్ణాటకలో ఏర్పడిన ఈ రాజకీయ ప్రతిష్టంభనపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.