రాబోయే ఐదు రోజుల్లో కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆయా రాష్ట్రాలు వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందాయి.
Darshan: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సహ నటి పవిత్ర గౌడతో సహజీవనంలో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి(33) సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టడంతో, అతను హత్యకు గురయ్యాడు.
ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై అత్యాచారం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలు చేసింది ఓ యువకుడు.. తనపై ఎమ్మెల్సీ సూరజ్ అత్యారానికి పాల్పడినట్లు హసనకు చెందిన జేడీఎస్ కార్యకర్త పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.
కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆమెపై బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
Karnataka: రానున్న రోజుల్లో కర్ణాటకలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై గురువారం అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మారారని ఆరోపించారు.
Siddaramaiah: కన్నడ భాష, నేల, నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కన్నడిగుడిపై ఉందని, రాష్ట్రంలో కన్నడ వాతావరణాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.
Actor Darshan case: కన్నడ స్టార్ హీరో దర్శన్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే 33 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హింసించి హత్య చేసిన ఘటనలో దర్శన్తో పాటు అతనితో సహజీవనం చేస్తున్న నటి పవిత్ర గౌడతో సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Actor Darshan case: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్శన్, పవిత్ర గౌడ సహజీవనంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నాడనే కారణంగా 33 ఏళ్ల రేణుకా స్వామి అనే వ్యక్తిని చంపేశారు. ఈ హత్యలో దర్శన్, పవిత్రలతో సహా 17 మందిని అరెస్ట్ చేశారు. వీరంత రేణుకా స్వామి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. బాధితుడిని కట్టేసి కర్రలతో…
శనివారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్పై 29.84 శాతం, డీజిల్పై 18.44 శాతం అమ్మకం పన్ను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.3, డీజిల్ రూ.3.05 చొప్పున పెరిగింది.