భారత ప్రభుత్వం రూపొందించిన మూడు క్రిమినల్ చట్టాలలో రాష్ట్ర స్థాయిలో సవరణలు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎం సత్యనారాయణ నేతృత్వం వహిస్తారు.
కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. గత 15 నెలల వ్యవధిలో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు తీవ్రమైన కరువు, పంట నష్టం మరియు విపరీతమైన అప్పులు అని రెవెన్యూ శాఖ పేర్కొంది.
పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు పాఠశాల విద్యార్థిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలో సోమవారం చోటుచేసుకుంది. హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ మాట్లాడుతూ.. ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ముఠా ఓ పాఠశాల విద్యార్థిపై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని తెలిపారు.
Pani Puri: పానీపూరీ లవర్స్ కు బిగ్ తగిలే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలో పానీపూరీని బంద్ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
Pani puri: ‘పానీ పూరి’ ఈ స్ట్రీట్ ఫుడ్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు లాగించేస్తుంటారు. అయితే, ఈ పానీ పూరి అనేక వ్యాధులకు కారణమవుతోంది.
కర్ణాటకలో రాజకీయ దుమారం ఊపందుకుంది. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం, మరో ముగ్గురు ఉపముఖ్యమంత్రుల డిమాండ్‌పై జరుగుతున్న చర్చల మధ్య.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకె శివకుమార్ శనివారం పార్టీ కార్యకర్తలు, నాయకులను ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు జారీ చేయవద్దని కోరారు.
కర్ణాటకలోని హవేరి జిల్లా బైడ్గి తాలూకాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును మినీ బస్సు ఢీకొనడంతో కనీసం 13 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలోని మృతులు శివమొగ్గ వాసులుగా గుర్తించారు. బెళగావి జిల్లా సవదత్తి నుంచి యల్లమ్మ దేవిని దర్శించుకుని తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మరోవైపు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని.. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.…
లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్-సెక్యులర్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌ను కర్ణాటకలోని బెంగళూరులోని ప్రత్యేక ప్రజాప్రతినిధి కోర్టు బుధవారం తిరస్కరించింది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్డి రేవణ్ణపై కర్ణాటకలోని హోలెనరసిపురా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
మరో మహిళ ప్రజ్వల్ రేవణ్ణపై సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు అడ్మిషన్ కోసం వెళ్లిన గృహిణిని ప్రజ్వల్ రేవణ్ణ లైంగికం వేధించినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రజ్వల్‌పై ఇప్పటి వరకు నలుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని స్కూల్లో చేర్పించేందుకు సాయం చేయాలని, అప్పటి జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ని కోరినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
కర్ణాటకలో చికెన్ కబాబ్, చేపల వంటకాల్లో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధం విధించారు. ఇప్పటికే.. గోబీ మంచూరియన్లో వాడే రంగులపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా.. ఈ ఫుడ్ పై నిషేధం విధించింది.