BJP MLA: శివుడు మూడో కన్ను తెరిస్తే రాహుల్ గాంధీ బూడిదే.. పార్లమెంట్‌లోనే అతడిని కొట్టాలి..
- రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..
- పార్లమెంట్‌లో బంధించి కొట్టాలి..
- శివుడు మూడో కన్ను తెరిస్తే అతడు బూడిదే..
- హిందూవులను కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేసినందుకు అతడిని పార్లమెంట్‌లో బంధించి, కొట్టాలని అన్నారు. ‘‘ రాహుల్ గాందీని పార్లమెంట్ లోపల లాక్కెళ్లి కొట్టాలి. ఈ చర్య ఎడెనిమిది ఎఫ్ఐఆర్‌లకు దాది తీస్తుంది. మంగళూర్ నగరానికి వస్తే, నేను అతడికి ఈ విధంగానే ఏర్పాట్లు చేస్తాను’’ అని మంగళూరు సిటీ నార్త్ ఎమ్మెల్యే శెట్టి అన్నారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శివుడి చిత్రాన్ని పట్టుకున్నారని, శివుడు మూడో కన్ను తెరిస్తే అతను బూదిదగా మారుతాడని ఆ పిచ్చివాడికి తెలియదని, వారు హిందూ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్నారని బీజేపీ నేత ఆరోపించారు. రాహుల్ గాంధీకి పిచ్చి పట్టిందని తేలిపోయిందని, హిందువులు తమ గురించి ఏం చెప్పినా నిశ్శబ్ధంగా వింటారని ఆయన భావిస్తున్నారని, రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మొరిగితే, స్థానిక నాయకులు ఇక్కడ తోక ఊపడం ప్రారంభిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
Read Also: Ukrainian President: మోడీ ఓ క్రిమినల్ను కౌగిలించుకోవడం బాధేసింది..
హిందూ మతాన్ని, సంస్థల్ని రక్షించడం బీజేపీ కర్తవ్యమని ఆయన అన్నారు. హిందువులు, హిందుత్వ అనేది వేర్వేరు అని కాంగ్రెస్ చెప్పడం ప్రారంభించిందని, ఇలాంటి నాయకుల వల్ల భవిష్యత్తులో హిందువులు ప్రమాదంలో పడతారని, హిందువులు బయటకు రాని పరిస్థితి సృష్టిస్తారని అన్నారు. కేరళలో రాహుల్ గాంధీ పర్యటిస్తే సెక్యులర్ వ్యక్తిగా మారుతాడని, అదే తమిళనాడుకి వెళ్తే నాస్తికుడు అవుతారని ఆరోపించారు. గుజరాత్ వచ్చినప్పడు ఆయన పరమ శివ భక్తుడిగా మారారని ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 99 లోక్‌సభ సీట్లను సాధించి, గొప్ప విజయం సాధించినట్లు రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారని, శివాజీ, మహరాణా ప్రతాప్ హిందూ సమాజంలో జన్మించారు, ఎప్పుడు అవసరం అవచ్చిన ఆయుధాలు తీసుకుంటాం, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో మాకు బాగా తెలుసు, పార్లమెంట్‌లో దెబ్బలు తిన్న రాహుల్ గాంధీ బాగానే ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
-
Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!