కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బూట్లు మాయమయ్యాయి. ఓ కార్యక్రమంలో పూజకు ముందు బయట షూ విడిచిపెట్టి వెళ్లారు. తిరిగొచ్చేటప్పటికీ మాయమయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సమీపంలో అంతా గాలించారు. కానీ ఎక్కడా కనిపించకపోవడంతో కారులో ఉన్న మరో జత చెప్పులతో కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఇది కూడా చదవండి: BJP Leader: ఇద్దరు లేదా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ పథకాలు కట్.. త్వరలో చట్టం..
సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. అయితే పూజకు ముందు బూట్లు తీసి లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పటికీ అవి మాయమయ్యాయి. పోలీసులు, అధికారులు, ఇతర సిబ్బంది బూట్ల కోసం వెతికినా దొరకలేదు. వైట్‌టాపింగ్, ఫుట్‌పాత్ అభివృద్ధి పనుల కోసం జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో బూట్లు దొంగిలింపబడ్డాయి. కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా.. కారులో ఉన్న చెప్పులు వేసుకుని వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Malvi Malhotra: మాల్వి మల్హోత్రా పై హత్యాయత్నం.. ఏకంగా మూడు కత్తి పోట్లు.. ఎందుకో తెలుసా?