DK Shivakumar: కర్ణాటకలో గత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో పలు స్కామ్ లో చోటు చేసుకున్నాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపణలు చేశారు. కాషాయ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని మండిపడ్డారు. ఈ విషయాలన్నీ తాము అసెంబ్లీ ముందుంచుతామన్నారు. ఇవాళ డీకే శివకుమార్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ హయాంలో 300 కోట్ల రూపాయలకు పైగా విలువైన కుంభకోణాలు వెలుగు చూశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ పాలకులకు అవినీతిలో తిరుగులేదన్నారు. బీజేపీ నేతల అవినీతి, కుంభకోణాలపై ఎంక్వైరీలు కొనసాగుతున్నాయి.. దోషులను తమ ప్రభుత్వం శిక్షిస్తుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కాగా, గత పదేళ్లలో బీజేపీ హయాంలో కమలం పార్టీ పాలకులు ఏకంగా 15, 16 ప్రభుత్వాలను కుప్పకూల్చారని అంతకు ముందు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also: Microsoft Outage : ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్.. విమాన సేవలకు అంతరాయం
ఇక, విపక్ష ప్రభుత్వాన్ని కూల్చడంతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 450 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విధానమే ప్రత్యర్ధి ప్రభుత్వాలను అస్ధిరపరచడమన్నారు. ఇప్పుడు కూడా ఇదే తంతు కొనసాగుతుందన్నారు. అవినీతి కుంభకోణాల్లో సీఎం, డిప్యూటీ సీఎంల పేర్లు చెప్పాలని తమ అధికారులను, నేతలను బీజేపీ నేతలు ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ఈ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఉపయోగిస్తామని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు కమలం పార్టీకి వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ అదే విధానాలను కొనసాగిస్తుందన్నారు.