మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరిగాయి. అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్ని సర్వేల్లోనూ ఎన్డీఏ కూటమిదే విజయమని తేల్చాయి. అయితే ఈ సర్వేలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.
Hair dryer blast: విచిత్రమైన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడి చేతులను కోల్పోవాల్సి వచ్చింది. ‘‘హెయిర్ డ్రైయర్’’ పేలడంతో మహిళ తన రెండు చేతుల్ని మోచేతుల వరకు గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని ఇల్కల్ పట్టణంలో బుధవారం జరిగింది. హెయిర్ డ్రైయర్‌ని పరిశీలిస్తున్న సమయంలో అది పేలడంతో బసమ్మ యారనల్ అనే బాధితురాలు తీవ్రంగా గాయపడింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజ్‌కుమార్ రోడ్డులోని ఈవీ స్కూటర్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. షోరూంలో పార్క్ చేసిన వాహనాలన్నీ దగ్ధమైనట్లు సమాచారం.
Woman drown: కర్ణాటక మంగళూర్‌లోని ఓ ప్రైవేట్ రిసార్టుల్లో విషాదం నెలకొంది. వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకుంటే అనుకోని ఘటన ఎదురైంది. మైసూర్‌కి చెందిన ముగ్గురు మహిళలు ఆదివారం రిసార్టులోని స్మిమ్మింగ్ పూల్‌లో ముగినిపోయి మరణించారు. ప్రైవేట్ బీచ్ రిసార్టులో ఈ ఘటన జరిగింది.
Karnataka: తల్లికూతుళ్లు ఇద్దరు వ్యభిచారం చేస్తు్న్నారని ఆగ్రహించిన ఇరుగుపొరుగు వారిపై దారుణంగా ప్రవర్తించారు. ఇద్దరిని ఇంటిని నుంచి బయటకులాగి కొట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. వ్యభిచార రాకెట్ నడుపుతున్నారని ఆరోపిస్తూ.. 60,29 ఏళ్ల వయసు కలిగిన తల్లికూతుళ్లతపై దాడి చేశారు. వారి బట్టలు చింపేసి దారుణంగా కొట్టారని పోలీసులు తెలిపారు.
Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎక్సైజ్ అధికారుల దోపిడిని ఆరికట్టాలంటూ కన్నడ రాష్ట్రంలో లిక్కర్ షాప్స్ ఓనర్స్ ఆందోళన బాట పట్టబోతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని మద్యం దుకాణాలు నవంబరు 20వ తేదీన మూత పడబోతున్నాయి.
Congress: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బడిముబ్బడిగా హామీల వర్షం కురిపించింది. అయితే, ఇప్పుడు ఈ హామీల వల్ల ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్త పన్నులు విధించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక సర్కార్ ప్రతిపాదించిన ‘‘గ్రీన్ సెస్’’ ముసాయిదా రూపొందించకముందే రాజకీయంగా కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది.
Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం బీజేపీపై పెద్ద ఆరోపణ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.
Karnataka : కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో బీతమ్మ గ్యాంగ్ ఆక్రమించుకోవడంతో ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.