ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి.. ఈ మోసాలు పలురకాలు.. కొంతమంది బ్యాంకు వివరాలను మాయమాటలు చెప్పి తెలుసుకొని కొట్టేస్తుంటే.. ఇంకొంతమంది మ్యాట్రిమోని పేరుతో డబ్బులు కొట్టేస్తున్నారు. మరికొంతమంది డబ్బుతో పాటు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తి తనకు తాను ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి నలుగురు యువతులను మోసం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బెల్గాంకు కుంపాత్గిరి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ భౌరో పాటిల్(31) అనే వ్యక్తి మ్యాట్రిమోనీలో వధువు కావలెను…
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. మనిషికి మరణం ఎలా అయినా సంభవించే అవకాశం ఉంది. తాజాగా కర్ణాటకలో ఓ పాములు పట్టే వ్యక్తి తాను పట్టుకున్న పాము చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాడ్గెరా తాలుకా గోడిహలాకు చెందిన బసవరాజు అనే వ్యక్తి తన గ్రామంలోకి వచ్చిన పాములను పట్టుకుంటుంటాడు. Read Also: ఆర్ఆర్ఆర్ కు కొత్త అర్ధం చెప్పిన భోజన ప్రియులు ఈ…
కర్ణాటక రాజధాని బెంగళూరులో మళ్లీ వింత శబ్దాలు భయపెడుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి వింత శబ్దాలు రావడంతో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ క్లారిటీ ఇచ్చింది. యుద్ధ విమానాన్ని పరీక్షిస్తున్నప్పుడు వచ్చిన శబ్దంగా చెప్పింది. గతేడాది మేలో వచ్చిన శబ్దాలకు క్లారిటీ ఇచ్చిన హెచ్ఏఎల్, అదే ఏడాది జూన్లో వచ్చిన శబ్దాలకు క్లారిటీ ఇవ్వలేదు. ఆ శబ్దాలకు ప్రత్యేక కారణాలు ఏవీ లేవని చెప్పింది. Read: నవంబర్ 27, శనివారం దినఫలాలు… కాగా, ఇప్పుడు మరోసారి బెంగళూరు…
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అనుకునే లోపే మళ్లీ కేసులు మొదలవుతున్నాయి. వ్యాక్సిన్ ను వేగంగా అందరికీ అందిస్తున్నా కరోనా నుంచి ఇప్పటి వరకు పూర్తిగా కోలుకోలేకపోయాం. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్లోని ఓ మెడికల్ కాలేజీలో 66 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్థారణ జరిగింది. 400 మంది విద్యార్థులున్న కాలేజీని మూసివేశారు. రెండు హాస్టల్స్ నుంచి విద్యార్థులు ఎవర్నీ బయటకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. Read: ఆ కొండ వెనుక కొండంత కష్టం……
అప్పుడప్పుడు మత్స్యకారుల వలకు అరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటిని వేలంలో భారీ ధరలకు విక్రయిస్తుంటారు. ఇలానే, కర్ణాటకలోని ఉడిపిలో మత్స్యకారుని వలకు అరుదైన ఘోల్ ఫిష్ చిక్కింది. ఈ రకమైన చేపలకు బహిరంగ మార్కెట్లో భారీ ధర ఉంటుంది. పెద్ద మొత్తంలో చెల్లించి వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఈరకమైన చేపల్లో ఔషదగుణాలు అధికంగా ఉంటాయి. మెడిసన్ రంగంలో వీటిని వినియోగిస్తుంటారు. Read: జరభద్రం: ఆ వైరస్ గాలిలో మూడు మీటర్లకు మించి ప్రయాణం…
ఎంతో అందమైన కుటుంబం.. ప్రేమించే భర్త.. బంగారం లాంటి ఇద్దరు కూతుళ్లు.. నిత్యం వారి అల్లరితో ఆ కుటుంబంలో నవ్వుల హరివిల్లు పూసేది. అలాంటి కుటుంబంలో చిచ్చుపెట్టింది వివాహేతర సంబంధం.. పరాయి వ్యక్తి మోజులో భర్తను మరిచింది ఆ భార్య.. చివరికి ప్రియుడితో గొడవ కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఇద్దరు కూతుళ్లను అనాధులుగా మార్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. శిడ్లఘట్ట పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్లో నివాసం ఉంటున్న వెంకటేష్,…
తండ్రి.. కన్నబిడ్డలకు ఆదర్శం.. హీరో. ఇంకా ఆడపిల్లలకైతే తండ్రే సర్వస్వము..కానీ, చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచాల్సిన తండ్రే వేధింపులకు గురి చేస్తే.. బయట ఎవరో ఏడిపిస్తున్నారని తండ్రికి చెప్పాల్సిన పిల్లలు తండ్రే తమపాలిట యముడిలా తయారయ్యాడని ఎవరికి చెప్పగలరు.. తాజాగా పుట్టినప్పటి నుంచి 17 ఏళ్లు వచ్చేవరకు తమను చిత్రవధకు గురిచేసిన తండ్రిపై పగపెంచుకున్న ఆ బాలిక కఠిన నిర్ణయం తీసుకొంది. ఈ చిత్రహింసలు తగ్గాలంటే తండ్రిని చంపడమే కరెక్ట్ అనుకొంది.. స్నేహితులతో, చెల్లెళ్ళతో కలిసి తండ్రిని హతమార్చింది.…
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కొన్ని రోజులుగా దక్షిణాదిలోని ఆయా ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉత్తర బెంగళూరు, ఉత్తర చెన్నై ప్రాంతాలను వరదలు ముంచె త్తాయి. కోసస్తలైయార్ నదికి వరద పోటెత్తడంతో ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు,కడప, నెల్లూరు పై కూడా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. బెంగళూరు, చైన్నై, ఏపీలలో ఇప్పటివరకు 24 మంది మరణించగా, పలువురు గల్లంతైనట్లు జాతీయ విపత్తునిర్వహణ అధికారులు తెలిపారు.…