కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు కూరగాయలు ధరలు అమాంతంగా పెరిగాయి. కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో కాయగూరల ధరలు కొండెక్కాయి. ఇప్పటికే టమోటా వందకు పైగా పలుకుతుంటే, ఆలు రూ. 40 కి పైగా పలుకుతున్నది. అయితే, ఇప్పడు ఆ బాటలో మునక్కాయలు కూడా చేరాయి. Read: సీడీఎస్ బిపిన్ రావత్ కన్నుమూత… ధృవీకరించిన ఆర్మీ… కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర మార్కెట్లో కిలో 400లకు పైగా పలుకుతున్నది.…
ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడమే కాదు.. తనకు నచ్చిన టీమ్, తాను మెచ్చిన విధంగా పనిచేసే టీమ్ ఉండాలని అందరు సీఎంలు కోరుకుంటారు.. ఇక, జాతీయ పార్టీలు అయితే.. వివిధ సమీకరణలు చూసుకుని మంత్రి వర్గ విస్తరణ, ప్రక్షాళన చేపడుతుంటింది.. ఇక, నాలుగు నెలల క్రితం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.. బీజేపీ హైకమాండ్ ఆదేశాలను మంత్రి వర్గ విస్తరణపై దృష్టిసారించారు.. తన కేబినెట్లో ప్రస్తుతం ఉన్న సుమారు 10 మంది పనితీరు బాగాలేదని…
దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ వేరయింట్ కేసులు పెరుగుతుంటే, మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాలయాల్లో విద్యార్థులకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 72 గంటల్లో తెలంగాణ, కర్ణాటకలోని విద్యాసంస్థల్లో వంద మందికి కరోనా సోకింది. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 43 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితం కళాశాలలో జరిగిన వేడుకల తరువాత కేసులు బయటపడ్డాయి. దీంతో…
ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో నివారణ చర్యలు చేపడుతున్నా దేశాలు.. ఇక, భారత్‌లోని రాష్ట్రాలు కూడా ఈ మహమ్మారి విజృంభించకుండా కీలక నిర్ణయాలు తీసుకుంఉటన్నాయి.. ఇక, ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం.. ముందుగా సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్, మంత్రి గోవింద కారజోళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, సీనియర్ అధికారి మంజునాథ్ ప్రసాద్, బీబీఎంపీ అధికారులు, నిపుణులతో…
కర్నాటక ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో వణికిపోతోంది. కర్నాటకలోని బెంగళూరులో కోవిడ్ క్వారంటైన్ తీసుకుంటున్న ఇద్దరికి ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు కేంద్రం నిర్ధారించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వీరిలో ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా జాతీయుడు కాగా.. మరో వ్యక్తిని బెంగళూరు వాసిగా గుర్తించారు. బెంగళూరు వాసి నుంచి మరో ఐదుగురికి వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో కర్నాటకలో కఠిన ఆంక్షలు అమలుచేయాలని నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ డబుల్ డోస్ సర్టిఫికెట్ వుంటేనే కాలేజీలు, మాల్స్, సినిమా థియేటర్లలోకి…
రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణమైన విషమే.. అవి కొన్నిసార్లు శృతి మించి ఇంకా ముందుకు సాగిన సందర్భాలు కూడా లేకపోలేదు.. రాజకీయ నేతలు హత్యకు గురైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నేతల మధ్య రాజకీయాల్లోనైనా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అందరూ కోరుకునే విషయం. అయితే, తాజాగా ఓ ఎమ్మెల్యే హత్యపై ఇద్దరి మధ్య కుదిరిన డీల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది… బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ…
కర్ణాటక మెడికల్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ కొంపముంచింది. కరోనా నిబంధనలు గాలికొదిలేసి ఫ్రెషర్స్ పార్టీ జరుపుకోవడంతో… వందలాది మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. ధార్వాడ్ మెడికల్ కాలేజీలో కరోనా కేసుల సంఖ్య 182కు చేరింది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో ధార్వాడ్ మెడికల్ కాలేజీ కోవిడ్ క్లస్టర్‌గా మారిపోయింది. బాధితుల్లో మెజార్టీ సంఖ్య టీకా రెండు డోసులు తీసుకొన్నవారే కావడం.. మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ధార్వాడ్ జిల్లాలోని ఎస్డీఎమ్ కాలేజ్ ఆఫ్ మెడికల్…
రాజకీయ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కాస్తా శృతిమించి తిట్ల పురాణానికి దారితీస్తున్నాయి.. కొందరు నేతలైతే ఏకంగా రాయడానికి ఇబ్బందిగా ఉండే బూతులు తేలికగా మాట్లాడేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఏ పార్టీ నేత నోరు తెర్చినా.. బూతులు, సవాళ్లకు కొదవలేకుండా పోయింది. ఇక, ఎన్నికలు వస్తే చాలు.. నేతల బూతులతో టీవీలు మార్మోగుతున్నాయి. అయితే, ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమా అంటే పొరపాటే.. కర్ణాటకలో విధాన పరిషత్ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రధాన…
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు.. ఎవరికి ఎవరితో ముడి పడేది ముందే నిశ్చయించబడుతుందని చెబుతారు.. ఇక, ఆ జంట చూడ ముచ్చటగా ఉంటే.. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని అభినందిస్తారు.. బెంగళూరులో తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంటను చూస్తే చూడ ముచ్చటగా ఉంది.. వరుడు విష్ణుకు 28 వచ్చినా.. వధువు జ్యోతికి 25 ఏళ్లు నిండినా.. వయస్సుకు తగ్గట్టు శరీరంలో పెరుగుదల లేదు.. ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.. అయితే, ఈ క్యూట్ కపుల్‌కు…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటుగా మరణాలు కూడా అధిక సంఖ్యలో సంభవించాయి. కరోనా కాలంలో మరణించిన వ్యక్తులను ప్రభుత్వమే ఖననం చేసింది. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు నిబంధనలు లేకపోవడంతో ప్రభుత్వమే ఖననం చేసింది. అయితే, బెంగళూరులోని ఈఎస్ఐ ఆసుపత్రిలో గత సంవత్సరం కాలంగా రెండు మృతదేహాలు ఖననం చేయకుండా మార్చరీలోనే ఉండిపోయాయి. అయితే, డిసెంబర్ 2020 లో ఈ ఆసుపత్రిలోనే కొత్త మార్చరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త…