వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. కన్నవారిని , కట్టుకున్నవారిని వదిలి పరాయి వారి మోజులో పడుతున్నారు.. చివరికి ఆ మోజులోనే దారుణాలకు ఒడిగట్టి జైలుపాలవుతున్నారు. తాజాగా ఒక భార్య భర్తకు తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొంది.. భర్తకు తెలియకుండా రోజు అతడిని కలవడానికి బయటకు వెళ్లేది . ఇక ఈ విషయం గమనించిన భర్త.. పక్కా ప్లాన్ వేసి భార్య బాగోతాన్ని బయటపెట్టాడు. రెడ్ హ్యాండెడ్ గా ప్రియుడితో సరసాలు ఆడుతున్న భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హోసూరు పారిశ్రామికవాడ బ్యాడరపల్లిలో నివాసముండే ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అనోన్యంగా ఉండే వీరి కాపురంలో వివాహ్ట్రా సంబంధం చిచ్చు పెట్టింది. గత కొంతకాలంగా భార్య వేరొక వ్యక్తితో అఫైర్ పెట్టుకొని భర్తను పట్టించుకోవడం మానేసింది. రోజూ భర్త లేని సమయంలో బయటికి వెళ్లి ప్రియుడిని కలిసి రాసలీలల్లో మునిగితేలేది. ఇటీవల రోజు భార్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని ప్లాన్ చేసిన భర్త.. భార్య బయటికి వెళ్లగానే ఆమెను ఫాలో అవుతూ వెళ్ళాడు. అక్కడ భార్య ప్రియుడితో సరసాలు ఆడడం చూసి ఖంగు తిన్నాడు. వెంటనే భార్యపై కోపంతో అక్కడిక్కడే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.